టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు తన రూట్ మార్చి ఒక సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటిస్తున్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘బైకర్’ (Biker) ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేస్తూ అంచనాలు పెంచారు మేకర్స్.
ఇంపాక్ట్ ఇస్తున్న ట్రైలర్:
లూజర్ వెబ్ సీరీస్తో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అభిలాష్ రెడ్డి ‘బైకర్’ సినిమాని తెరకెక్కించారు. ఈ చిత్రం ప్యూర్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ట్రైలర్ చాలా పవర్ ఫుల్ ఇంపాక్ట్ తీసుకొచ్చింది. రేసింగ్ సీక్వెన్స్‌లను హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గట్టుగా ఉన్నాయి. వేగం, భావోద్వేగాలు, గెలుపు కోసం చేసే పోరాటం చుట్టూ సాగిన ట్రైలర్ సినిమాపై ఆసక్తి క్రియేట్ చేసింది.
సాధారణంగా మన దగ్గర క్రికెట్ లేదా కబడ్డీ నేపథ్యంలో సినిమాలు వస్తుంటాయి, కానీ బైక్ రేసింగ్ (Motocross) నేపథ్యంలో సినిమా రావడం ఇదే మొదటిసారి. ఈ మూవీలో శర్వానంద్ ఒక ఉత్సాహవంతుడైన రేసర్‌గా, రాజశేఖర్ ఆయనకు దిశానిర్దేశం చేసే మెంటర్‌గా కనిపించారు. ఏదేమైనా.. గూస్‌బంప్స్ తెప్పించే అడ్వెంచరస్ రైడ్‌కు ఆడియన్స్ సిద్దమైపొండి!!
ఏప్రిల్ 3న థ్రిల్లింగ్ రేస్ షురూ!
‘బైకర్’ మూవీ వాస్తవానికి గతేడాది డిసెంబర్‌లోనే విడుదల కావాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇపుడు ఏప్రిల్ 3న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. వేసవి సెలవులను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం ఖాయమని ట్రైలర్ కన్ఫామ్ చేసేసింది.
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో మాళవిక నాయర్ హీరోయిన్ నటిస్తుంది. బ్రహ్మాజి, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.
శర్వానంద్ భోగి:
మరోవైపు, శర్వానంద్ సంపత్ నంది దర్శకత్వంలో ‘భోగి’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శర్వానంద్ హీరోగా నటిస్తున్న 38వ చిత్రమిది.
ఇదొక రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడికల్ యాక్షన్ డ్రామా. 1960 తెలంగాణ- సరిహద్దులో జరిగిన ఓ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందింస్తున్నారు. ఈ మూవీలో శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి నటించనున్నారు.
