Shekar Movie OTT: థియేటర్స్లో విడుదలైన రెండేళ్లకి OTTకి రానున్న శేఖర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Shekar Movie OTT: థియేటర్స్లో విడుదలైన రెండేళ్లకి OTTకి రానున్న శేఖర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

టాలీవుడ్ నటుడు రాజశేఖర్(Rajashekhar) ప్రధాన పాత్రలో వచ్చిన మూవీ శేఖర్(Shekhar). క్రైం థ్రిల్లర్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాను జీవిత రాజశేఖర్(Jeevitha Rajashekhar) తెరకెక్కించారు. 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుండి పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. కానీ, కోర్టు గొడవల కారణంగా ఈ సినిమా ప్రదర్శనను అర్దాంతరంగా నిలిపివేశారు. ఆ గొడవలు క్లియర్ చేసి శేఖర్ సినిమాను మళ్ళీ థియేటర్స్ లోకి తీసుకురావాలని మేకర్స్ ప్రయతించారు కానీ, కుదరలేదు. 

ఇక అప్పటినుండి ఈ సినిమా గురించి ఆడియన్స్ కూడా మర్చిపోయారు. ఇపుడు తాజాగా మరోసారి శేఖర్ సినిమా గురించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. దాదాపు రెండేళ్ల తరువాత ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు సిద్ధం కానుందట. అవును శేఖర్ మేకర్స్ ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే.. ఏ ప్లాట్ఫామ్స్ లో ఎప్పుడు స్ట్రీమింగ్ కి రానుంది అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందట.

శేఖర్ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమాలో రాజశేఖర్ క్రైమ్ ఇన్వేస్టిగేష‌న్‌లో స్పెష‌లిస్ట్ అయిన రిటైర్డ్ పోలీస్ ఆఫీస‌ర్‌గా కనిపించారు. కొన్ని కారణాల వల్ల శేఖర్ తన భార్య ఇందు నుండి విడిపోతాడు. తరువాత కొన్నిరోజులకి ఇందు చనిపోయిందని శేఖర్ కి తెలుస్తుంది. కానీ, ఇందు చనిపోలేదని కావాలనే ఎవరో మర్డర్ చేశారని అనుమానిస్తాడు. మరి నిజంగా ఇందు హత్య చేయబడిందా? అదే నిజమైతే.. ఆమెను ఎవరు హత్య చేశారు? ఎందుకు చేశారు?ఈ కథలో శేఖర్ కూతురు పాత్ర ఏంటి? అనేది మిగిలిన కథ.