
విలక్షణ నటుడు సాయాజీ షిండే(Sayaji Shinde)కు గురువారం ఛాతీలో నొప్పితో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు గుండెలో కొన్ని బ్లాక్స్ ఉన్నట్లు గుర్తించారు. వాటికి యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని కూడా డాక్టర్లు తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న సాయాజీ షిండే అభిమానులు ఆందోళన చెడుతుండటంతో.. స్వయంగా సాయాజీ షిండే తన ఆరోగ్య పరిస్థితిపై వీడియో బైట్ విడుదల చేశారు.. నేను బాగానే ఉన్నాను. కంగారు పడకండి. నన్ను ప్రేమించే అభిమానులు, శ్రేయోభిలాషులు వెంట ఉన్నంతవరకు నాకు ఏమీ జరగదు. త్వరలోనే మళ్లీ అందరికీ వినోదాన్ని పంచుతానని.. నవ్వుతూ చెప్పుకొచ్చారు సాయాజీ షిండే. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.