సినీ నటి రేణు దేశాయ్‎ సోషల్ మీడియా వేధింపుల కేసులో ఇద్దరు అరెస్ట్

సినీ నటి రేణు దేశాయ్‎ సోషల్ మీడియా వేధింపుల కేసులో ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్: సినీ నటి రేణు దేశాయ్‎ను సోషల్ మీడియాలో వేధించిన కేసులో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిద్దరూ సోషల్ మీడియాలో రేణు దేశాయ్‎పై అసభ్యకర కామెంట్లు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్స్‎పై నటి రేణు దేశాయ్ 2026, మార్చి 2న సైబరాబాద్ సైబర్ క్రైమ్‎ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో కొందరు తన పోస్టులకు అసభ్యకరంగా కామెంట్స్ పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. వల్గర్ కామెంట్స్ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మొత్తం నాలుగు సోషల్ మీడియా అకౌంట్లపై ఆమె ఫిర్యాదు చేశారు.

రేణు దేశాయ్ కంప్లైంట్ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రేణు దేశాయ్‎పై అసభ్యకర కామెంట్స్ చేస్తోన్న ఇద్దరిని మంగళవారం (మార్చి 17) అరెస్ట్ చేశారు. ఇప్పటికే యాంకర్ అనసూయ సోషల్ మీడియా వేధింపుల కేసులో కూడా పోలీసులు ఒకరిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 

►ALSO READ | Kangana Ranaut : 'బాలీవుడ్‌కు సిగ్గు లేదు'.. నోరా ఫతేహి అశ్లీల పాటపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు!

సెలబ్రిటీలనే టార్గెట్‎గా చేస్తూ తప్పుడు కామెంట్లు చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. చీకట్లో ఉండి చేస్తున్నాము.. మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు అనే ధైర్యంతో కామెంట్లు చేస్తున్న కేటుగాళ్ల పని పడుతున్నారు. తప్పుడు పనులు చేసిన వారు ఎక్కడున్న వదలమని మరోసారి హెచ్చరించారు పోలీసులు.