Kangana Ranaut : 'బాలీవుడ్‌కు సిగ్గు లేదు'.. నోరా ఫతేహి అశ్లీల పాటపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు!

Kangana Ranaut : 'బాలీవుడ్‌కు సిగ్గు లేదు'.. నోరా ఫతేహి అశ్లీల పాటపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు!

కన్నడ యాక్షన్ స్టార్ ధ్రువ సర్జా హీరోగా, దర్శకుడు ప్రేమ్ రూపొందిస్తున్న భారీ పాన్ -ఇండియా చిత్రం ‘KD: ది డెవిల్’ .  ఇప్పుడు ఈ మూవీ  బాక్సాఫీస్ వద్ద కంటే వివాదాలతోనే దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపుతోంది. ఈ చిత్రంలోని “సర్కే చునర్ తేరి సర్కే” అనే స్పెషల్ సాంగ్ చుట్టూ వివాదం ముసురుకుంది. రాజకీయ రంగు పులుముకోవడమే కాకుండా న్యాయపరమైన చిక్కుల్లో పడింది. ఈ పాటలో బాలీవుడ్ డ్యాన్సింగ్ సెన్సేషన్ నోరా ఫతేహి అశ్లీలంగా నటించిందని, సాహిత్యం అత్యంత అసభ్యకరంగా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

న్యాయపరమైన చిక్కుల్లో చిత్ర బృందం!

ఈ పాటపై నిషేధం విధించాలని కోరుతూ ముంబైకి చెందిన ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)తో పాటు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. ఆయన తన ఫిర్యాదులో ఈ పాటలోని సాహిత్యం, దృశ్యాలు కేవలం పబ్లిక్ డెన్సీని దెబ్బతీసేలా ఉండటమే కాకుండా, మైనర్లకు తీవ్ర హాని కలిగించే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

"యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విచ్చలవిడిగా ప్రచారంలో ఉన్న ఈ పాట, సమాజంలో అసభ్యతను ప్రోత్సహిస్తోంది వినీత్ జిందాల్ ఫిర్యాదులో పేర్కొన్నారు . భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్ 294 , పోక్సో (POCSO) చట్టం ప్రకారం ఇలాంటి కంటెంట్‌ను పంపిణీ చేయడం నేరం. అందుకే దీనిపై ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్‌లో కూడా క్రిమినల్ ఫిర్యాదు చేశాం అని తెలిపారు. ఈ వివాదంలో పాట రాసిన రాకీబ్ ఆలం, సంగీత దర్శకుడు అర్జున్ జన్య, గాయని మంగ్లీ కూడా విచారణను ఎదుర్కోవాల్సి ఉందని స్పష్టం చేశారు.

 

బాలీవుడ్‌కు సిగ్గు లేదు..  

ఈ వివాదంపై బీజేపీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ నటి కంగనా రనౌత్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. నోరా ఫతేహి పాటపై స్పందిస్తూ.. "బాలీవుడ్ అశ్లీలతకు, అటెన్షన్ సీకింగ్ ట్రిక్కులకు అన్ని హద్దులు దాటేసింది. దేశమంతా వీళ్లను చీదరించుకుంటున్నా, వీరికి మాత్రం సిగ్గు అనిపించడం లేదు. ఇలాంటి అసభ్యతపై ప్రభుత్వం కఠినమైన నిబంధనలు విధించాల్సిన సమయం వచ్చింది. బాలీవుడ్‌కు ఖచ్చితంగా కళ్లెం వేయాలి అంటూ కంగనా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట మంటలు రేపుతున్నాయి. సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

 

మంగ్లీకి తలనొప్పి తప్పదా?

తెలుగులో టాప్ సింగర్‌గా ఉన్న మంగ్లీ, ఈ పాట పాడటం ఇప్పుడు ఆమె అభిమానులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతంలో కూడా కొన్ని పాటల విషయంలో మంగ్లీ వివాదాలను ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఏకంగా ఢిల్లీ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫిర్యాదులో ఆమె పేరు ఉండటం చర్చనీయాంశమైంది.

►ALSO READ | Rithu Chowdary: ప్రేమించి మోసం చేశాడు.. మరో అమ్మాయితో వెళ్లిపోయాడు.. రీతూ చౌదరి ఎమోషనల్ పోస్ట్!

1970ల నాటి బెంగళూరు అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే ‘KD: ది డెవిల్’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, కేవలం ఒక స్పెషల్ సాంగ్ వల్ల సినిమా మొత్తం నెగిటివ్ టాక్‌లోకి వెళ్లడం చిత్ర యూనిట్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. సెన్సార్ బోర్డు ఈ ఫిర్యాదుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, ఈ పాటను డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్ నుండి తొలగిస్తారో లేదో వేచి చూడాలి.