దసరా రోజు.. జమ్మిచెట్టుకు పూజ.. పాలపిట్ట దర్శనం.. విశిష్టత.. ప్రాధాన్యత ఇదే..!

దసరా రోజు.. జమ్మిచెట్టుకు పూజ.. పాలపిట్ట దర్శనం.. విశిష్టత.. ప్రాధాన్యత ఇదే..!

దసరా పండుగ గురించి పురాణాల్లో విశేషంగా చెప్పారు.  హిందువులు ఈ పండుగను ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు. రామాయణం.. మహాభారత గ్రంధాల్లో కూడా ఈ పండుగ  ప్రాధాన్యత.. విశిష్టత గురించి చెప్పారు. దసరా పండుగ రోజున పాండవులు పాల పిట్టను చూడటం.. రాముడు యుద్దంలో విజయం సాధించిన రోజుని   భక్తిశ్రద్దలతో జరుపుకుంటారు. . దసరా రోజు భక్తి శ్రద్ధలతో పండుగను జరుపుకుంటే మంచి జరుగుతుందని ప్రజలు నమ్ముతారు.

మహాభారతంలో  పాండవులు రాజ్యాన్ని విడిచి అరణ్యవాసంలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిన రోజు.. వాళ్లకు సంబంధించిన ఆయుధాలన్నింటినీ ఒక మూట కట్టి, తిరిగొచ్చే వరకూ వాటిని చూసుకోమని జమ్మి చెట్టుకి కడతారు. అరణ్యవాసం పూర్తయ్యాక వాళ్లు ఆశ్వయుజ మాసంలోని దశమి రోజునే తిరిగొచ్చి తమ ఆయుధాలను తీసుకుంటారు. ఆ తర్వాత కౌరవులపై యుద్ధం చేసి తిరిగి తమ రాజ్యాన్ని పాండవులు దక్కించుకున్న విషయం తెలిసిందే.

వాళ్ళు దశమి రోజున జమ్మి చెట్టుకు తిరిగొచ్చినందునే దసరా పండుగను జరుపుకోవడంతో పాటు, ఆ రోజే ప్రత్యేకంగా జమ్మి చెట్టుకి పూజలు చేస్తారు. అదే రోజు పాండవులు జమ్మిచెట్టుపై ఒక పాల పిట్టను చూశారు. అందుకే దసరా రోజున పాలపిట్టను చూసి, జమ్మి చెట్టుకు మొక్కితే మంచి జరుగుతుందని నమ్ముతారు. 

జమ్మి చెట్టును పూజిస్తూ ఈ స్తోత్రం చదవాలి

శమీ శమయతే పాపం 

శమీ శత్రువినాశినీ

అర్జునస్య ధనుర్ధారీ

రామస్య ప్రియదర్శినీ!!

కరిష్యమాణ యాత్రాయా యథాకాలమ్ సుఖం మయా తత్ర నిర్విఘ్న కల్తీత్వం భవ శ్రీరామ పూజితా!!

జమ్మి చెట్టుకు మొక్కుకున్న తర్వాత జమ్మి ఆకులను తీసి పట్టుకొని, బంధువులకు, స్నేహితులకు ఇవ్వడం అన్నది సంప్రదాయం. 'జమ్మి చెట్టుని ఈ రోజున ఎంత ప్రత్యేకంగా చూస్తారంటే, జమ్మి ఆకులను 'బంగారం' అని పిలుచుకుంటారు. ఇందులోనే అలయ్ బలయ్ అన్న మంచి ఆలోచన ఉంది. ఆలయ్ ఐలయ్ అన్నది ఇతరులతో సోదరభావాన్ని కలిగించేది. జమ్మి ఆకు అంటే బంగారాన్ని చేతిలో పెట్టి అవతలివాళ్లను కౌగిలించుకోవడమే ఆలయ్ బలయ్.

ALSO READ : దసరాఉత్సవాలు: విజయదశమి( అక్టోబర్20).. ఆ రోజు ఈ పనులు అస్సలు చేయొద్దు..!

మగవాళ్లు ఆడబిడ్డల కాళ్లకు దండం పెట్టి జమ్మి ఆకులని చేతికిస్తారు. నాన్నమ్మలు, అమ్మమ్మలు, మేనత్తలు, అమ్మలు, చిన్నమ్మలే కాదు... చెల్లెళ్లయినా, అక్కలైనా, వదినలైనా... వాళ్ల కాళ్లు మొక్కుతారు. ఇలాంటి సంప్రదాయం ఒక్క తెలంగాణాలోనే ఉంది.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.