Mallika Rajput : ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ సింగర్

Mallika Rajput : ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ సింగర్

ప్రముఖ గాయని, నటి విజయ లక్ష్మి అలియాస్ మల్లికా రాజ్‌పుత్(Mallika Rajput) (35)అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కోత్వాలి నగర్‌లోని సీతాకుండ్ ప్రాంతంలో మల్లికా రాజ్‌పుత్ ఇవాళ (ఫిబ్రవరి 13న) తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో ఆమె ఫ్యామిలీ మొత్తం శోకసంద్రంలో మునిగింది. 35 సంవత్సరాల వయసులోనే సింగర్ ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఏటువంటి కారణాలున్నాయానే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

మల్లిక తల్లి సుమిత్రా సింగ్ మాట్లాడుతూ..ఈ సంఘటన జరిగినప్పుడు తమకు తెలియదని..గది తలుపు మూసి ఉంది..కానీ లైట్ ఆన్ చేసి ఉండటంతో..అనుమానం వచ్చి తలుపు కొట్టాను. నేను ఎంత తలుపు కొట్టినా మల్లికా తీయలేదు. చివరికి, కిటికీలోంచి చూడగా..ఫ్యాన్ కు నా కూతురు వేలాడుతూ కనిపించింది. నేను నా భర్తకు, తెలిసిన వారికి వెంటనే ఫోన్ చేసాను, కానీ నా కూతురు అప్పటికే చనిపోయిందంటూ కన్నీరు మున్నీరయ్యారు మల్లిక తల్లి.

Also Read:జయప్రదను అరెస్ట్‌ చేయాలని కోర్టు ఆదేశాలు 

కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి శ్రీరామ్ పాండే మాట్లాడుతూ..మల్లికా రాజ్‌పుత్ మరణించిన విధానం చూస్తే ఆత్మహత్య అని తెలుస్తోంది.
అయితే, పోస్టుమార్టం నివేదిక వస్తేనే మృతికి గల ఖచ్చితమైన కారణం తెలుస్తుందని ఆయన చెప్పారు.

ఇక  మల్లికా రాజ్‌పుత్ సినిమా విషయానికి వస్తే బాలీవుడ్ లో పలు చిత్రాలలో నటిస్తూనే సింగర్ గా రాణిస్తుంది. ఇంత చిన్న వయసులోనే మల్లికా చనిపోవడంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.