సింగూరు ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

సింగూరు ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. దీంతో అధికారులు 11 నెంబర్ గేటు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 3528 క్యూ సెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 9654 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా.. ప్రాజెక్టు ప్రస్తుత నీటి సామర్థ్యం 29.589 టీఎంసీలుగా ఉంది. 


ALSO READ: బులుగు రంగులో సాలిపురుగు.. కొత్తగా కనిపెట్టిన శాస్త్రవేత్తలు
 

పెరుగుతున్న వరద దృష్ట్యా ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాల ప్రజలు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.