బులుగు రంగులో సాలిపురుగు.. కొత్తగా కనిపెట్టిన శాస్త్రవేత్తలు

బులుగు రంగులో సాలిపురుగు.. కొత్తగా కనిపెట్టిన శాస్త్రవేత్తలు

ప్రపంచంలో లక్షలాది సాలెపురుగులు ఒకేసారి చిన్న మొక్కలపై గూళ్లు కట్టుకున్నాయి. వీటిలో కొన్ని కిలోమీటరు పొడవు ఉండటం విశేషం.  సాలెపురుగులు చెట్లు, రోడ్డు సైన్‌లు, పొదలపై ఇలా గూళ్లు నిర్మించుకున్నాయి. దీంతో ఇవి మొక్కలపై పరిచిన దుప్పట్ల మాదిరిగా కనువిందు చేస్తుంటాయి.  వింత వింతల ప్రపంచంలో థాయిలాండ్ లో  శాస్త్రవేత్తలు కొత్త రకమైన సాలీడును కనుగొన్నారు.  అది బ్లూ కలర్ లో ఉండటంతో  బ్లూ స్పైడర్ (బ్లూ స్పైడర్ థాయిలాండ్) అని పేరు పెట్టారు.   ఇది పూర్తిగా కొత్త రకంతో ఉండటంతో  శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. 


ALSO READ: ఈ ఐదు తెలిస్తేనే.. భవిష్యత్లో ఉద్యోగం.. లేకపోతే అంతే

థాయిలాండ్‌లోని ఫాంగ్-న్గా ప్రావిన్స్‌లో పరిశోధకులు కొత్త జాతి టరాన్టులా (ఎలక్ట్రిక్ బ్లూ టరాన్టులా) సాలీడును శాస్త్రవేత్తలు  కనుగొన్నారు. సాధారణ నీలి సాలీళ్లకంటే ఇది మరింత పెద్ద సైజులో, మరింత నీలం రంగులో  ప్రకాశవంతంగా ఉండడం విశేషం. జీవులలో ఈ సాలీడు చాలా అరుదుగా ఉంటుందని  శాస్త్రవేత్తలు తెలిపారు.  

  సాలీడు ప్రస్తుతం అంతరించే దశలో ఉందని, వంటచెరకు, ఖనిజాల కోసం అడవులను నరుకుతుండడంతో వీటి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ  క్రమంలో కొత్త జాతి సాలీడు కోసం అన్వేషిస్తున్నప్పుడు  ఎలక్ట్రిక్ బ్లూ టరాన్టులా కనపడిందని డాక్టర్ నరిన్ చోంఫుఫుంగ్ తెలిపారు.   పరిశోధకులు రెండురకాల సాలె పురుగులను చూసినట్లు తెలిపారు,  కొత్తగా కనగొన్న బ్లూ కలర్ సాలీడు చెట్ల తొర్రల్లో ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.  దీనిని మడ అడవుల్లో కనిపెట్టారు.  ఇది  చిలోబ్రాచిస్ నతనిచారమ్ జాతికి సంబంధించినది తెలిపారు. 

కొంతమంది వ్యాపారులు సాలీళ్లను విక్రయిస్తున్నారు.  అక్రమంగా అమ్ముతున్నారని వీటికి  ఎలక్ట్రిక్ బ్లూ స్పైడర్ అని పేరు పెట్టారు.  వీటికి నీలం రంగు సహజ సిద్దంగా వచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు.  టరాన్టులా జాతికి చెందిన సాలె పురుగులు విషపూరితం కాదంటున్నారు పరిశోకులు. ప్రకృతిలో నీలం రంగులో ఉండే ప్రాణులు కొంత శక్తిని కలిగి ఉంటాయి.  నీలం రంగులో కాంతిని ప్రతిబింబించే శక్తి ఉంటుంది.  కొన్ని టాస్టులాలు ( సాలెపురుగులు) వైలెట్ రంగులో ఉండి మెరిసిపోతుంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు.   ప్రత్యేక రంగు గల ఈ సాలీడుకు జువెల్ ఆఫ్ ది ఫారెస్ట్' అని పేరు పెట్టారు.