ఆయిల్ ఫామ్ టన్నుకు రూ. 25 వేల మద్దతు ధర కల్పిస్తామన్నారు మంత్రి తుమ్మ లనాగేశ్వర్ రావు. వరిపొలం కాకుండా ఆయిల్ ఫామ్ వేసుకుని చూస్తే లాభదాయకంగా ఉంటుంది. ఆయిల్ ఫామ్ వల్ల అధిక లాభాలు ఉన్నాయన్నాని.. అసలు నష్టం ఉండదని చెప్పారు.
అన్ని జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ లు ఏర్పాట్టు చేస్తాంమన్నారు. హిందూస్తాన్ కంపెనీ తో టయప్ చేసుకోని ఆయిల్ ఫామ్స్ ముందుకు సాగుతుందన్నారు. టన్నుకి 25 వేల రూపాయలు ఇప్పిస్తామన్నారు. హిందూస్తాన్ కంపెనీ గురించి మనకు తెలుసు ఎక్కువ శాతం ఉత్పత్తి ఉన్నా కంపెనీ. కొన్ని పంటల వల్ల రైతు బతకలేకపోతున్నాడని చెప్పారు. అందుకే ఆయిల్ ఫామ్ పంట వల్ల రైతులు సంతోషంగా ఉంటారని చెప్పారు. కామారెడ్డి జిల్లాలో ఫామ్ ఆయిల్ పంట మార్కెటింగ్ హిందూస్తాన్ కంపెనీ చూసుకుంటుందన్నారు తుమ్మల.
30 ఏండ్ల దాకా దిగుబడి
ఆయిల్ పామ్ మొక్కలను ఒకసారి నాటితే 30 సంవత్సరాల వరకు దిగుబడి ఇస్తాయి. నాలుగో సంవత్సరం నుంచి రైతుకు పంట చేతికి వస్తుంది. మొదటి నాలుగు సంవత్సరాల వరకు ప్రభుత్వమే నిర్వహణ ఖర్చులు భరిస్తున్నది. మొదటి మూడు సంవత్సరాలు మొక్కజొన్న, పత్తి, వేరుశనగ లాంటి పంటలను అంతర పంటగా సాగు వేసుకోవచ్చు. నాలుగో సంవత్సరం నుంచి పంట దిగుబడి వస్తుంది. ఎకరాకు కనీసం 10 టన్నులకు తక్కువ కాకుండా దిగుబడి పొందవచ్చు. చెట్టు పెరిగే కొద్దీ మెలకువలు పాటిస్తూ 15 నుంచి 20 టన్నుల వరకూ దిగుబడి సాధించవచ్చు.
ఎకరాకు రూ.2లక్షల ఆదాయం
రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగుచేసే రైతులకు మొదటి నాలుగు సంవత్సరాల్లో అంతర పంటల సాగుకు, కలుపు తీయడానికి, ఇతర నిర్వహణ ఖర్చుల కోసం ఎకరానికి రూ.4,200 ఆర్థిక సాయం అందిస్తోంది. మార్కెట్లో రూ.193 ఉన్న మొక్కలను సబ్సిడీపై కేవలం రూ.20కే రైతులకు సప్లై చేస్తోంది. డ్రిప్ యూనిట్ ఖర్చులో ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, బీసీలకు 90 శాతం, ఇతరులకు 80 శాతం సబ్సిడీగా అందిస్తోంది.
