మీ ఇజ్జత్ తీసుకోవడానికి మీరే చాలు: ప్రపంచం ముందు మరోసారి పరువు పొగొట్టుకున్న పాక్

మీ ఇజ్జత్ తీసుకోవడానికి మీరే చాలు: ప్రపంచం ముందు మరోసారి పరువు పొగొట్టుకున్న పాక్

ఇస్లామాబాద్: ప్రపంచ ముందు పరువు పొగొట్టుకోవడం పొరుగు దేశం పాకిస్తాన్‎కు అలవాటు. ఇతరులు ఎవరూ ఆ దేశం పరువు తీయాల్సిన అవసరం లేదు. వాళ్లకు వాళ్లే ప్రపంచ దేశాల ముందు ఇజ్జత్ పొగొట్టుకుంటారు. తాజాగా మరోసారి అంతర్జాతీయ సమాజం ముందు దాయాది దేశం అబాసుపాలైంది. USA అబ్రివేషన్ తప్పుగా రాసి ప్రపంచముందు నవ్వులపాలైంది. 

2026, ఫిబ్రవరి 18 నుంచి 20 వరకు జరగనున్న బోర్డ్ ఆఫ్ పీస్ ప్రారంభ సమావేశంలో పాల్గొనేందుకు పాకిస్తాన్  ప్రైమినిస్టర్ షెహబాజ్ షరీఫ్​అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనకు సంబంధించి పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో యూఎస్ఏను యునైటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు బదులుగా యునైట్స్ స్టేట్స్ ఆఫ్ అమెరికాస్ అని పేర్కొంది.

ఈ తప్పును గుర్తించిన పలువురు సోషల్ మీడియాలో పాకిస్తాన్‎ను ఏకీపారేస్తున్నారు. పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికారులకు కనీసం యూఎస్ఏ అబ్రివేషన్ కూడా తెలియదా.. షేమ్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రపంచ ముందు పరువు పొగొట్టుకోవడం పాకిస్తాన్‎కు కొత్తేమి కాదులే అని ఇంకొందరు ఎగతాళి చేస్తున్నారు. 

పాకిస్తాన్ నేతలు, అధికారులు ఇలాంటి తప్పిదాలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి మిస్టేక్స్ చాలా సార్లు చేశారు ఆ దేశ నేతలు, అధికారులు. గత సంవత్సరం ఇజ్రాయెల్ ఇరాన్‌పై వైమానిక దాడులు చేసిన తర్వాత.. పాక్ పీఎం షెహబాజ్ షరీఫ్ ‘‘నేను ఈ దాడిని ఖండిస్తున్నాను’’  అని కాకుండా ‘‘నేను ఈ దాడిని కండోమ్ చేస్తున్నాను’’ అని ట్వీట్ చేసి నవ్వుల పాలయ్యారు. ఇన్ని జరిగినా.. పాకిస్తాన్ మాత్రం తమకేమీ పట్టనట్టు మళ్లీ మళ్లీ అలాంటి చేష్టలే చేసి.. ఉన్న పరువును కాస్తా పొగొట్టుకుంటుంది.