ECILలో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు.. నెలకు రూ.31 వేల జీతం.. క్వాలిఫికేషన్ ఏంటంటే..

ECILలో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు.. నెలకు రూ.31 వేల జీతం.. క్వాలిఫికేషన్ ఏంటంటే..

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

  • ఖాళీలు: 200.
  • విభాగాల వారీగా ఖాళీలు: టెక్నికల్ ఆఫీసర్ – సి (కేటగిరీ–1) 100, టెక్నికల్ ఆఫీసర్ – సి (కేటగిరీ-2) 30, టెక్నికల్ ఆఫీసర్-సి (కేటగిరీ-3) 70.  
  • ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ), ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈటీసీ), ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్ (ఈ & ఐ), ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (ఈఈఈ) లేదా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్​లో బీఈ/ బి.టెక్. పూర్తిచేసి ఉండాలి. కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి.  
  • కనీసం 60 శాతం మార్కులతో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)లో బీఈ, బి.టెక్. పూర్తిచేసి ఉండాలి. 
  • కనీసం 60 శాతం మార్కులతో మెకానికల్ ఇంజినీరింగ్ లేదా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్​లో  బీఈ/ బి.టెక్. పూర్తిచేసి ఉండాలి. 
  • గరిష్ట వయోపరిమితి: 30 ఏండ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
  • అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
  • వాక్ ఇన్ ఇంటర్వ్యూ: ఫిబ్రవరి 24. 
  • సెలెక్షన్ ప్రాసెస్: రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
  • శాలరీ/ స్టైఫండ్
  • మొదటి సంవత్సరం: నెలకు రూ.25,000.
  • రెండో సంవత్సరం: నెలకు రూ.28,000.
  • మూడో, నాలుగో సంవత్సరం: నెలకు రూ.31,‌‌‌‌‌‌000.
  • పూర్తి వివరాలకు hindustanpetroleum.com వెబ్​సైట్​ను సందర్శించండి.