భూపాలపల్లిజిల్లా కోర్టులో ఏసీబీ రైడ్స్.. లంచం తీసుకుంటూ దొరికిన సిబ్బంది

భూపాలపల్లిజిల్లా  కోర్టులో ఏసీబీ రైడ్స్..  లంచం తీసుకుంటూ దొరికిన సిబ్బంది

తెలంగాణలో అవినీతి అధికారుల భరతం పడుతోంది ఏసీబీ. లంచం తీసుకుంటున్న ప్రభుత్వ అధికారులు, పోలీసులు,ప్రభుత్వ సిబ్బందిని ఎక్కడికక్కడ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటోంది.  ఇవాళ ఫిబ్రవరి 20న  లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికారు భూపాలపల్లి జిల్లా కోర్టు సిబ్బంది.

భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ రైడ్స్ నిర్వహించగా రూ. 5 వేలు  లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు కోర్టు సిబ్బంది. స్టెనోగ్రాఫర్ సాయి చరణ్, సిబ్బంది పున్నం రజిత, కొమ్ము సునీతలను అదుపులోకి తీసుకున్నారు  ఏసీబీ అధికారులు. ఓ  కేసుకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీలు ఇచ్చేందుకు న్యాయవాదిని లంచం డిమాండ్ చేశారు కోర్టు సిబ్బంది. దీంతో న్యాయవాది గోపాలరావు  ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్లాన్ తో ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా కోర్టు సిబ్బందిని  పట్టుకుంది ఏసీబీ.

ALSO READ : ప్రధాని మోదీ రాజీ పడి..దేశ గౌరవాన్ని వ్యాపారం చేశారు..

ఫిబ్రవరి 19న హైదరాబాద్ బషీర్ బాగ్లో  ఓ ఫైల్‌‌ను ప్రాసెస్ చేయడానికి రూ.70 వేల లంచం తీసుకుంటూ ఇద్దరు విద్యాశాఖ అధికారులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ వ్యక్తి తన స్కూల్​కు 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన సీబీఎస్ఈ ఎన్ఓసీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ ఫైల్‌‌ను ప్రాసెస్ చేయడానికి హైదరాబాద్ సైఫాబాద్‌‌లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ గుమ్మిడల శ్రీధర్‌‌  రూ.70 వేల డిమాండ్ చేశాడు. డిమాండ్ చేసిన రూ.70 వేల నగదును సూపరింటెండెంట్ సంగీన ఫణిరాజ్​ సమక్షంలో సీనియర్ అసిస్టెంట్ స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఇద్దరు అధికారులపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచారు.