ప్రధాని మోదీ రాజీ పడి..దేశ గౌరవాన్ని వ్యాపారం చేశారు..AI సమ్మిట్ ప్రాంగణంలో యూత్ కాంగ్రెస్ ఆందోళన

ప్రధాని మోదీ రాజీ పడి..దేశ గౌరవాన్ని వ్యాపారం చేశారు..AI సమ్మిట్ ప్రాంగణంలో యూత్ కాంగ్రెస్ ఆందోళన


AI ఇంపాక్ సమ్మిట్ జరుగుతున్న ఢిల్లీలోని భారత్ మండపం ప్రాంగణంలో ఉద్రికత్త  చోటు చేసుకుంది. శుక్రవారం (ఫిబ్రవరి 20) ఈవెంట్ నిర్వహణ లోపాలపై ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యువజన కాంగ్రెస్ నాయకులు చొక్కాలు విప్పి  నిరసనలు తెలిపారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ  సమ్మిట్ లోనికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు.  దీంతో భారత్ మండపంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

భారత్ పరువు పోయింది.. ‘‘ఇది భారత్ గర్వించదగ్గ విషయం కాదు’’.. ‘‘ఇంక్విలాబ్ జిందాబాద్ ’’అని నినాదాలు చేస్తూ  సమ్మిట్ లోనికి చొచ్చుకుపోయారు.  ‘‘ప్రధాని మోదీ రాజీపడ్డారు.. సమ్మిట్  లో  దేశ గుర్తింపును వ్యాపారం చేశారు’’ అని  యువజన కాంగ్రెస్ నేతలు అన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మరోవైపు నిరసన తెలుపుతున్న యూత్ కాంగ్రెస్ నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమ్మిట్ కార్యక్రమాలకు అంతరాయం కలిగించినందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

ఈ ఘటన AI ఇంపాక్ సమ్మిట్  కార్యక్రమాల సమయంలో రాజకీయ ఉద్రిక్తతలు రేపింది. టెక్నాలజీ చర్చలనుంచి అధికార, ప్రతిపక్ష  పార్టీల మధ్య   రాజకీయ రగడ వైపు  దృష్టి ని మళ్లించింది. 

ALSO READ : UKG ఫీజు రూ.4 లక్షలా.. నా IIT చదువుకే ఇంత లేదు..

AI సమ్మిట్ నిర్వహణపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేసిన తర్వాత  ఈ ఘటన చోటు  చేసుకుంది. అస్తవ్యస్తమైన ప్రజా కార్యక్రమాల నిర్వహణ అంటూ రాహుల్  కామెంట్ చేశారు.   దేశ ప్రతిభ, డేటాను ఉపయోగించుకోవాల్సింది పోయి.. చైనా ఉత్పత్తులను ప్రదర్శిస్తూ భారత డేటాను అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా సమ్మిట్ నిర్వహణపై తీవ్ర ఆరోపణలు చేశారు. షోపీస్ కార్యక్రమమని , పూర్తిగా గందరగోళంగా  మారిందని ఖర్గే  విమర్శించారు. 

ఇప్పటికే సమ్మిట్  నిర్వహణ లోపాలు,  మౌలికసదుపాయాల కల్పనపై సమ్మిట్ కు హాజరైన సీఈవోలు, టెక్ కంపెనీలు, ప్రముఖులు నెట్టింట తీవ్ర విమర్శలు చేశారు. తమకు కలిగిన అసౌకర్యాన్ని నెటిజన్లతో షేర్ చేసుకోవడంతో సమ్మిట్ నిర్వహణపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే కొనసాగుతోంది.