UKG ఫీజు రూ.4 లక్షలా.. నా IIT చదువుకే ఇంత లేదు.. సాఫ్ట్వేర్ ఉద్యోగికే ఇలా ఉంటే.. సామాన్యుడి పరిస్థితి ఏంటీ...

UKG ఫీజు రూ.4 లక్షలా.. నా IIT చదువుకే ఇంత లేదు.. సాఫ్ట్వేర్ ఉద్యోగికే ఇలా ఉంటే.. సామాన్యుడి పరిస్థితి ఏంటీ...

ఇండియాలో ఒక కుటుంబం ఎక్కువ ఖర్చులు దేని మీద చేస్తుంది.. విద్య, వైద్యం.. అంతే కదా. పేద, మధ్య తరగతి కుటుంబాలకు తమ పిల్లలను ఆరోగ్యంగా ఉంచుతూ.. చదివించుకోవడం ఎంత కష్టమో ఎవరిని కదిలించినా చెబుతారు. చాలీ చాలని జీతాలతో పిల్లలను చదివించలేక సతమతమయ్యే వారు కొందరైతే.. తలకు మించిన భారంగా.. ఆదాయానికి మించి ఫీజులు కడుతూ మరింత పేదరింకలోకి కూరుకుపోతున్న వాళ్లు కొందరు. ఇండియాలో ఎడ్యుకేషన్ ఇన్ ఫ్లేషన్ ఎలా ఉందో తెలియాలంటే.. IIT బాంబే లో చదివిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మాటలు వినాల్సిందే. భారత్ లో ఉన్న ఎడ్యుకేషన్ ఖర్చుల గురించి అతడు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. 

ప్రస్తుత విద్యా విధానంలో LKG నుంచి స్టడీస్ ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలో ఒక ఫ్యామిలీ ఎల్కేజీ, యూకేజీలకే లక్షల కొద్దీ ఖర్చవుతోంది. దీనిపై అవిరల్ భట్నాగర్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోసల్ మీడియాలో వైరల్ గా మారింది. 

మా కజిన్ కూతురు యూకేజీ (UKG) చదువుకోసం ఏడాదికి 4 లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయి. ముంబైలో యూకేజీ కోసం సంవత్సరానికి ఇంత ఖర్చు చేయడమేంటి..? నా IIT చదువుకు కూడా ఇంత ఖర్చు కాలేదు. ఐఐటీ బాంబే లో 4 ఏళ్లకు నాకు అయిన ఖర్చు.. దీంట్లో సగం. అంటే రెండు లక్షలతో 4 ఏళ్ల IIT కోర్స్ పూర్తి చేశాను. ఇండియాలో ఎడ్యుకేషన్ ఖర్చుల గురించి కనీసం ఒక్కరు కూడా మాట్లాడటం లేదు. ట్యూటర్స్ నమ్ముకోవడం బెటరేమో.. అంటూ ట్వీట్ చేశాడు అవిరల్ భట్నాగర్. 

భట్నాగర్ ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అయిన AJVC స్టార్టప్ కు ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. భట్నాగర్ IIT బాంబేలో 2010 నుంచి 2014 వరకు ఇంజినీరింగ్ ఫిజిక్స్ లో బీటెక్ చేశాడు. 

భట్నాగర్ ఎక్స్ పోస్ట్ లో ఎడ్యుకేషన్ ఖర్చులు ఇండియాలో సామాన్యుడిని ఎలా కుదిపేస్తున్నాయో హైలెట్ చేశాడు. అతడు చెప్పినట్లు యూకేజీ ఫీజులు.. ఇంజినీరింగ్ ఖర్చుల కంటే ఎక్కువై పోవడం ఆందోళన కలిగించే అంశం.