2024లో బోల్డ్ కంటెంట్‌తో సోషల్ సెటైర్ గా వచ్చి సంచలనం సృష్టించిన చిత్రం' హాట్ స్పాట్' . ఆ తర్వాత ఈ మూవీకి సీక్వెల్ గా వచ్చిన ‘హాట్ స్పాట్ 2 మచ్’ (Hot Spot 2 Much) జనవరి 23న విడుదలైన తమిళంలో హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ రోజు ( ఫిబ్రవరి 20 ) ఓటీటీ ప్లాట్ ఫారమ్స్ లో రిలీజ్ అయింది. అయితే సాధారణంగా ఒక సినిమా ఒకటో రెండో OTT ప్లాట్‌ఫారమ్స్‌లో విడుదలవ్వడం చూస్తుంటాం. కానీ ఈ సినిమా ఏకంగా ఆరు ప్లాట్‌ఫారమ్స్‌లో ఒకేసారి స్ట్రీమింగ్ అవుతూ రికార్డు సృష్టిస్తోంది..
ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అవుతోందంటే?
ఈ చిత్రం ఈ రోజు ( ఫిబ్రవరి 20 ) ఓటీటీ ప్లాట్ ఫారమ్స్ లో రిలీజ్ అయింది. వాటిల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా తమిళ్, సింప్లీ సౌత్, లయన్స్‌గేట్ ప్లే, షార్ట్‌ఫ్లిక్స్, ఏపీ ఇంటర్నేషనల్ సౌత్ సినిమాలలో అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం కేవలం తమిళం (సబ్-టైటిల్స్‌తో, హిందీ (లైన్స్‌గేట్ ప్లేలో) భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. ఒకే సారి ఆరు ఓటీటీ ప్లాట్ ఫారమ్స్ లో రిలీజ్ అయి డిజిటల్ దునియాను షేక్ చేస్తోంది.
తెలుగు వెర్షన్ ఎక్కడ?
మొదటి భాగం తెలుగులో డబ్బింగ్ అయ్యి మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో, సీక్వెల్ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ, ప్రస్తుతం ఈ చిత్రం తెలుగులో ఎక్కడా అందుబాటులో లేదు. మేకర్స్ తెలుగు వెర్షన్ రిలీజ్ గురించి ఇంకా ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో తెలుగు ఆడియన్స్ వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది.
మూడు ‘షాకింగ్’ కథలు..
ఈ సీక్వెల్‌ను కూడా దర్శకుడు అంతాలజీ ఫార్మాట్‌లోనే తెరకెక్కించారు. ఇందులో ముఖ్యంగా మూడు కథలు సమాజంలోని ముసుగులను తీసేలా చిత్రీకరించారు. స్టార్ హీరోల మధ్య జరిగే ఫ్యాన్ వార్స్ ఎంతటి దారుణాలకు దారితీస్తాయో ఇందులో చూపించారు. ఎమ్‌ఎస్ భాస్కర్ పోషించిన తండ్రి పాత్ర, తన కొడుకును ఫ్యాన్ వార్స్‌లో కోల్పోయి ఇచ్చే స్పీచ్ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. అమ్మాయిల దుస్తుల విషయంలో సమాజం చూసే కోణంపై ఇందులో గట్టి సెటైర్ వేశారు. తండ్రి (తంబి రామయ్య), కూతురు మధ్య సాగే ఈ కథలో వచ్చే ఒక ట్విస్ట్ ప్రేక్షకులను షాక్‌కు గురి చేస్తుంది.2050 నుంచి ( టైమ్ ట్రావెల్ ) వచ్చిన ఒక అమ్మాయితో సాగే ప్రేమకథ. ఇందులో భవిష్యత్తు గురించి వేసిన జోకులు నవ్వులు పూయిస్తాయి. అయితే దీని క్లైమాక్స్ మాత్రం చాలా బోల్డ్‌గా ఉంటుంది.
కలెక్షన్స్
థియేటర్లలో జనవరి 23న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.3.3 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మొదటి భాగంతో పోలిస్తే ఇది మెరుగైన వసూళ్లే అయినప్పటికీ, విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్స్ బాగున్నా, కొన్ని చోట్ల లెక్చర్ ఇచ్చినట్లు అనిపిస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రియా భవాని శంకర్, అశ్విన్ కుమార్, భవాని శ్రీ, రాక్షసన్, బ్రిగిడా సాగా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. విష్ణు విశాల్ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రం రూపొందింది. విభిన్నమైన, కాస్త బోల్డ్ అండ్ సోషల్ సెటైర్ చిత్రాలను ఇష్టపడే వారైతే.. తమిళం లేదా ఇంగ్లీష్ సబ్-టైటిల్స్‌తో ఈ చిత్రాన్ని OTTలలో వీక్షించవచ్చు..
