Pakistan: టీ20 వరల్డ్ కప్‌లో వరుసగా విఫలమవుతున్న బాబర్ ఆజమ్‌పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసుఫ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పొట్టి ఫార్మాట్‌కు అవసరమైన స్కిల్ సెట్ బాబర్‌కు లేదని స్పష్టం చేశాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 3 మ్యాచ్‌ల్లో కేవలం 66 పరుగులు మాత్రమే చేశాడని పేర్కొన్నారు. బాబర్‌ను జట్టు నుంచి తప్పించాలన్న నా సూచనను అప్పట్లో జట్టు మేనేజ్‌మెంట్ పూర్తిగా తిరస్కరించింది.. ఆ ఒక్క కారణంతో నేను సెలెక్టర్ పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించాడు.
గత రెండు మూడు ఏళ్లుగా నేను ఇదే చెబుతున్నాను.. బాబర్ టెక్నిక్ పూర్తిగా దెబ్బతింది.. ఇది ఫామ్ సమస్య కాదు.. ఓ ప్లేయర్ రెండు మూడు సిరీస్‌ల వరకు మాత్రమే అవుట్ ఆఫ్ ఫామ్‌లో ఉండగలడు.. కానీ బాబర్ గత మూడేళ్లుగా పరుగులు చేయలేకపోతున్నాడు.. నేను అతడిని రెస్ట్ ఇవ్వాలని చెప్పగానే అందరూ నాపై తిరగబడ్డారు.. అందుకే సెలక్టర్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.. ఆ తర్వాత కొన్ని సిరీస్‌లకు బాబర్ ని తప్పించారని యూసుఫ్ ఓ పాడ్‌కాస్ట్‌లో చెప్పుకొచ్చాడు.
మైండ్‌సెట్ పేరుతో తప్పుదోవ పట్టిస్తున్నారని కూడా యూసుఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్కిల్స్ లేకపోతే మైండ్ ఏం చేస్తుంది?.. మానసిక బలం మాత్రమే సరిపోదు.. అసలు నైపుణ్యం లేకుండా మనసు ఏం ఉపయోగపడుతుంది? అని మాజీ క్రికెటర్ యూసఫ్ ప్రశ్నించారు. తాను క్రికెట్ ఆడే సమయంలో ఆటగాళ్లతో బాబర్‌ను పోల్చడం అసంభవమని యూసుఫ్ అన్నారు. ఇంజమామ్ ఉల్ హక్, సయీద్ అన్వర్, యూనిస్ ఖాన్, జహీర్ అబ్బాస్ లాంటి వారి స్థాయి వేరు.. వాళ్లతో బాబర్‌ను పోల్చలేం.. ఆ నలుగురు పూర్తిగా భిన్నమైన స్థాయిలో ఉన్న ప్లేయర్స్.. వాళ్ల ముందు బాబర్ ఏమాత్రం సరిపోడు అంటూ ఘాటుగా విమర్శించాడు. యూసఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్ క్రికెట్ వర్గాల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి. బాబర్ భవిష్యత్‌పై మరోసారి నీలి మేఘాలు కమ్ముకుంటున్నాయి.
