నావిటైన్ సిస్టమ్‌‌లో ప్రాబ్లమ్.. ఎయిర్పోర్టుల్లో ప్రయాణికుల ఇబ్బందులు..

నావిటైన్ సిస్టమ్‌‌లో ప్రాబ్లమ్.. ఎయిర్పోర్టుల్లో ప్రయాణికుల ఇబ్బందులు..
  •  భారత్‌‌, యూరప్‌‌లో అంతరాయం

న్యూఢిల్లీ: ఎయిర్​లైన్స్​ సంస్థలకు సాఫ్ట్ వేర్‌‌ సేవలు అందించే నావిటైన్ సిస్టమ్‌‌లో టెక్నికల్ ​సమస్య కారణంగా గురువారం ఇండియాతోపాటు యూరప్‌‌ దేశాల్లోని పలు ఎయిర్​పోర్టుల్లో సేవలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఢిల్లీలో ఏఐ సమిట్​కు వస్తున్నవారు ఇబ్బందులు పడ్డారు. నావిటైన్ సిస్టమ్‌‌ రిజర్వేషన్‌‌, డిపార్చర్‌‌ కంట్రోల్​లో కీలకంగా పనిచేస్తుంది.

మన దేశంలో ఎయిర్​ఇండియా మినహా ఇతర అన్ని ఎయిర్​లైన్స్​లు  దీనిని ఉపయోగిస్తాయి. ఉదయం 6:45 నుంచి 7:28 వరకు, మళ్లీ 8:10 నుంచి 8:25 వరకు సిస్టమ్‌‌లో సమస్యలు తలెత్తాయి. దీంతో చెక్-ఇన్‌‌, బోర్డింగ్‌‌ ప్రక్రియల్లో డిలే ఏర్పడి,  ప్రయాణికులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చింది.  ఏఐ సమిట్ కారణంగా హైప్రొఫైల్‌‌ ప్రతినిధుల రాకపోకలు కూడా ఉండటంతో టెర్మినల్స్ పై అదనపు ఒత్తిడి పడింది.