నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 25.
ఖాళీలు: 515 (ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ).
విభాగాల వారీగా ఖాళీలు: ఎలక్ట్రికల్ 165, మెకానికల్ 210, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్ 125. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 15.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో కనీసం 65 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. గేట్ -2025 పూర్తిచేసి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 27 ఏండ్లు, కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 11.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మాజీ సైనికులకు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: ఫిబ్రవరి 25.
సెలెక్షన్ ప్రాసెస్: గేట్ - 2025 స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు..
పూర్తి వివరాలకు ntpc.co.in వెబ్ సైట్ సందర్శించండి.
