పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈచిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలను నెలకొన్నియి. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో ఈ రోజు ( ఫిబ్రవరి 19, 2026 ) రిలీజ్ అయింది.' ఆరా ఆఫ్ ఉస్తాద్' (Aura of Ustaad) పేరుతో వస్తున్న ఈ పాట అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ప్రోమోలో పవర్ ప్యాక్డ్ విజువల్స్..
లేటెస్ట్ గా విడుదలైన ఈ చిన్న ప్రోమోలో పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్స్‌ను క్విక్ కట్స్‌తో చూపించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తన పాత సినిమాల్లోని పాపులర్ మేనరిజంను ఇందులో రిపీట్ చేయడం ఫ్యాన్స్‌కు ఐ-ఫీస్ట్‌గా మారింది. దేవి శ్రీ ప్రసాద్ (DSP) అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పల్స్ రేటును పెంచేలా ఉంది. యానిమేషన్ వర్క్ కూడా చాలా క్వాలిటీగా ఉండటంతో, లిరికల్ వీడియో నెక్స్ట్ లెవల్‌లో ఉండబోతోందని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఫుల్ సాంగ్ ను ఫిబ్రవరి 22న రిలీజ్ చేయనున్నారు మేకర్స్
రిలీజ్ ఎప్పుడు?
మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల,రాశీ ఖన్నా నటిస్తున్నారు. 'గబ్బర్ సింగ్' తర్వాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్ కావడంతో ట్రేడ్ వర్గాల్లోనూ భారీ క్రేజ్ ఉంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. దశరథ్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా సందడి చేయనుంది.
ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్ 'భగత్ భగత్' సృష్టించిన సంచలనం తెలిసిందే. ఇప్పుడు ఈ రెండో పాటతో సినిమా ప్రమోషన్లను మరో స్థాయికి తీసుకెళ్లాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈసారి హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్‌ను మరింత మాస్ అవతార్‌లో చూపించబోతున్నారని 'ఆరా ఆఫ్ ఉస్తాద్' ప్రోమో హింట్ ఇస్తోంది. ఫిబ్రవరి 22న రాబోయే పూర్తి పాట కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
