
ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్(Shanmukh Jashwanth) గంజాయి కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అతని అన్నయ్య వినయ్ సంపత్(Vinay Sampath) కోసం ఫ్లాట్ కి వెళ్లిన పోలీసులకు షణ్ముఖ్ గంజాయి సేవిస్తూ కనిపించాడు. దీంతో షణ్ముఖ్, వినయ్ సంపత్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ప్రస్తుతం బెయిల్ ద్వారా షణ్ముఖ్ బయటకు రాగా.. అతని అన్న వినయ్ సంపత్ మాత్రం పోలీసుల అధీనంలోనే ఉన్నారు.
ఇక గంజాయి సేవించడంపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా తాను డిప్రెషన్ లో ఉన్నానని, సూసైడ్ కూడా చేసుకోలాని అనుకున్నానని షణ్ముఖ్ మాట్లాడిన వీడియో తెగ వైరల్ అయ్యింది. దీంతో బిగ్ బాస్ తరువాత జరిగిన పరిణామాల వల్లనే షణ్ముఖ్ డిప్రెషన్ లోకి వెళ్లాడని, దానికి దీప్తితో బ్రేకప్ కూడా ఒక కారణమని టాక్ నడుస్తోంది.
అయితే తాజాగా ఇదే విషయంపై మరో యూట్యూబర్, నటి సిరి(Siri) స్పందించారు. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. షణ్ముఖ్ పర్సనల్ లైఫ్ ఇలా అవుతుందని అసలు ఊహించలేదు. బిగ్ బాస్ తరువాత కూడా నేను కలవలేదు. అప్పటికే బ్రేకప్ బాధలో ఉన్న తనని కలవడం కరెక్ట్ కాదనిపించింది. తరువాత ఎవరి కెరీర్లో వారు బిజీ అయిపోయాం. షణ్ముఖ్ ను కలిసినా కలవకపోయినా.. తను బాగుండాలని కోరుకుంటాను.. అంటూ చెప్పుకొచ్చారు సిరి. ప్రస్తుతం సిరి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.