మరోసారి ‘హీరో ’ అనిపించుకున్న సోనూ సూద్

మరోసారి ‘హీరో ’ అనిపించుకున్న సోనూ సూద్

సోనూ సూద్. పరిచయం అక్కర్లేని పేరు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తూ నిత్యం వార్తలో నిలసుస్తుంటారు. ఇప్పుడు కూడా అలాంటి ఓ సాయం చేసి సోనూ సూద్ మళ్లీ వార్తల్లోకెక్కారు. సౌతాఫ్రికా నుంచి ఇండియాకు ఫ్లైట్ లో వస్తున్న సోనూ సూద్... నడవలేక ఇబ్బందిపడుతున్న ఓ పెద్దాయనను తన బిజినెస్ క్లాస్ సీటులో కూర్చోబెట్టి  ఔదార్యాన్ని చాటుకున్నారు. అనంతరం సోనూ సూద్ ఆ వృద్ధుడికి సంబంధించిన ఎకానమీ క్లాస్ సీట్ లో కూర్చున్నారు.

ఈ విషయాన్ని అదే ఫ్లైట్ లో ప్రయాణించిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ ఫ్లైట్ లో నడవడం కూడా కష్టంగా మారిన ఓ వృద్ధుడిని సోనూ సూద్ గమనించారు. వెంటనే ఆ పెద్దాయనను తీసుకొచ్చి తన బిసినెస్ క్లాస్ సీటులో కూర్చోబెట్టారు. అది చూసిన ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరూ... సోనూ సూద్ దయా గుణానికి ముగ్ధులైపోయారు. తర్వాత సోనూ సూద్ ఆ పెద్దాయనకు కేటాయించిన ఎకానమీ క్లాస్ సీటులో కూర్చున్నారు’ అని ఆ ప్రయాణికుడు చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి...

25వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ ఇన్స్పెక్టర్

కాలేజీ విద్యార్థినులతో స్టెప్పులేసిన కలెక్టరమ్మ