కాలేజీ విద్యార్థినులతో స్టెప్పులేసిన కలెక్టరమ్మ

కాలేజీ విద్యార్థినులతో స్టెప్పులేసిన కలెక్టరమ్మ

కేరళ: ప్రజాసేవే కాదు అప్పుడప్పుడు ఎంజాయ్ మెంట్ కూడా ఆరోగ్యానికి ఎంతో అవసరం అని తెలిపారు కేరళ రాష్ట్రంలోని ఓ కలెక్టరమ్మ. ఓ కార్యక్రమం సందర్భంగా కాలేజీ విద్యార్థినులతో డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. కేర‌ళ రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లా కలెక్టర్ దివ్య ఎస్ అయ్య‌ర్ సోమవారం మహాత్మా గాంధీ యూనివర్శిటీ యూనియన్ ఆర్ట్స్ ఫెస్టివల్ కోసం ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు వ‌చ్చారు. అక్క‌డ కాథోలికేట్ క‌ళాశాల విద్యార్థినులు ఫ్లాష్‌మాబ్ చేస్తున్నారు. వాళ్లు పిల‌వ‌గానే క‌లెక్ట‌ర్ వెళ్లి డ్యాన్స్ చేశారు. గోలియోన్ కీ రాస‌లీలా రామ్‌లీలా సినిమాలోని న‌గాడా పాట‌పై అదిరిపోయే స్టెప్పులేశారు. దివ్య ఎస్ అయ్య‌ర్ చిన్న‌ప్పుడే కూచిపూడి, ఒడిస్సీ, కథాకళి, క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నారట. అందుకే విద్యార్థినులు పిల‌వ‌గానే వెళ్లి డ్యాన్స్ చేశాన‌ని ఆమె చెప్పారు.