
జూలై 14 నుంచి జింబాబ్వేలో జరిగే టీ20 ముక్కోణపు సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు తన స్క్వాడ్ ను ప్రకటించింది. ఈ సిరీస్ కు సీనియర్ బ్యాటర్ విలియంసన్ కు జట్టులో చోటు దక్కలేదు. ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నే కివీస్ జట్టులోకి ఇవ్వగా.. దేశవాళీ క్రికెట్ లో తన పవర్ హిట్టింగ్ తో సంచలనంగా మారిన బ్యాటర్ బెవాన్ జాకబ్స్‌కు ఛాన్స్ దక్కింది. 15 మంది సభ్యుల జట్టుకు మిచెల్ సాంట్నర్ కెప్టెన్సీ చేస్తాడు. కివీస్ కొత్త ప్రధాన కోచ్ రాబ్ వాల్టర్ 2026 టీ20 వరల్డ్ కప్ కు ఈ సిరీస్ తో సన్నాహాలు ప్రారంభిస్తాడు. వర్క్ లోడ్ కారణంగా పేసర్ లాకీ ఫెర్గూసన్ కు రెస్ట్ ఇచ్చారు.
కైల్ జెమీసన్ వ్యక్తిగత కారణాల వలన ఈ సిరీస్ ఆడడం లేదు. గాయం కారణంగా బెన్ సియర్స్ సెలక్ట్ చేయలేదు. పేలవ ఫామ్ తో ఉన్న డెవాన్ కాన్వే, వికెట్ కీపర్ బ్యాటర్ మిచ్ హేలకు చోటు లేదు. టిమ్ సీఫెర్ట్ వికెట్ కీపర్ గా సెలక్ట్ చేశారు. ఐపీఎల్ కమిట్ మెంట్ ల కారణంగా పాకిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్ కు దూరమైన గ్లెన్ ఫిలిప్స్, రచీన్ రవీంద్ర, సాంట్నర్ లాంటి కీలక ఆటగాళ్లు న్యూజిలాండ్ జట్టులో తిరిగి వచ్చారు. మేజర్ లీగ్ క్రికెట్ ముగిసిన రెండు రోజుల తర్వాత, జూలై 16న హరారేలో దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ తమ తొలి టీ20 మ్యాచ్ ఆడుతుంది.
ట్రై సిరీస్ కు న్యూజిలాండ్ జట్టు:
మిచ్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, బెవాన్ జాకబ్స్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రాచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి
New Zealand have included Adam Milne and Bevon Jacobs in their T20I squad for next month's tri-series in Zimbabwe, but they will be without Kane Williamson and Lockie Ferguson pic.twitter.com/QB74Vo0qss
— ESPNcricinfo (@ESPNcricinfo) June 26, 2025
న్యూజిలాండ్ కంటే ముందే సౌతాఫ్రికా తన 14 మందితో కూడిన స్క్వాడ్ ను ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ మార్కరం ఈ సిరీస్ కు దూరంగా ఉన్నాడు. అనుభవజ్ఞుడు రాస్సీ వాన్ డెర్ డస్సెన్ సఫారీ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. కార్బిన్ బాష్, లువాన్-డ్రే ప్రిటోరియస్, రూబిన్ హెర్మాన్, సెనురాన్ ముత్తుసామి తొలిసారి సఫారీ జట్టుకి ఎంపికయ్యారు. ఇటీవలే టీ20 క్రికెట్ లో తన సంచలన బ్యాటింగ్ తో అదరగొట్టిన డెవాల్డ్ బ్రెవిస్ సౌతాఫ్రికా జట్టులో స్థానం సంపాదించాడు. గాయం నుంచి కోలుకున్న ఫాస్ట్ బౌలర్లు జెరాల్డ్ కోట్జీ, నాండ్రే బర్గర్ జట్టులో చేరారు. జూలై 14 న ఆతిధ్య జింబాబ్వేతో సౌతాఫ్రికా తమ తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది.
►ALSO READ | WI vs AUS 2025: రెండు రోజుల్లోనే 28 వికెట్లు.. రసవత్తరంగా వెస్టిండీస్, ఆస్ట్రేలియా టెస్ట్
ట్రై సిరీస్ కు సౌతాఫ్రికా జట్టు:
రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రీవిస్, నాండ్రే బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, రీజా హెండ్రిక్స్, రూబిన్ హెర్మాన్, జార్జ్ లిండే, క్వేనా మఫాకా, సెనురాన్ ముత్తుసామి, లుంగి ఎంగిడి, న్కాబా పీటర్, లువాన్-డ్రే సిమ్టోరియస్, ఆండ్రే సిమ్టోరియస్
🇿🇦 South Africa announce 14-player squad for T20I tri-series in Harare against Zimbabwe and New Zealand, starting 14th July! 🏏🔥 pic.twitter.com/rdC0YgQjce
— CricketGully (@thecricketgully) June 26, 2025
ట్రై-సిరీస్ షెడ్యూల్
జూలై 14 - జింబాబ్వే v దక్షిణాఫ్రికా
జూలై 16 - దక్షిణాఫ్రికా v న్యూజిలాండ్
జూలై 18 - జింబాబ్వే v న్యూజిలాండ్
జూలై 20 - జింబాబ్వే v దక్షిణాఫ్రికా
జూలై 22 - న్యూజిలాండ్ v దక్షిణాఫ్రికా
జూలై 24 - జింబాబ్వే v న్యూజిలాండ్
జూలై 26 - ఫైనల్