Sreeleela: షాకింగ్ ట్విస్ట్.. అఖిల్ ‘లెనిన్’ నుంచి శ్రీలీల ఔట్?

Sreeleela: షాకింగ్ ట్విస్ట్.. అఖిల్ ‘లెనిన్’ నుంచి శ్రీలీల ఔట్?

అఖిల్ అక్కినేని రాబోయే యాక్షన్ డ్రామా ‘లెనిన్’. ఇందులో హీరోయిన్గా శ్రీలీల నటిస్తోంది. అయితే, ఇపుడీ మూవీ నుంచి శ్రీలీలను తప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటీ? ఇప్పటికే లెనిన్ నుంచి టీజర్ సైతం విడుదలైంది. అందులో అఖిల్ వెనుకల శ్రీలీల నించుని ఉంటుంది కదా? అంతెందుకు.. అఖిల్కు జంటగా లెనిన్ లో శ్రీలీల కనిపించనున్నారని ఓ వీడియో రిలీజ్ చేసి అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు.

ఇప్పుడిలా సడెన్గా సినిమా మధ్యలో అలా ఎలా తీసేసే ఛాన్స్ ఉంటుందనే సందేహం అందరికీ వస్తుంది? అసలు శ్రీలీలను మేకర్స్ తప్పించారా? లేదా తానే స్వయంగా తప్పుకుందా? అనేది వివరాల్లో చూద్దాం.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ప్రస్తుతం శ్రీలీల వరుస సినిమాలతో బిజీగా ఉంది. 'ఉస్తాద్ భగత్ సింగ్', 'మాస్ జతారా', 'జూనియర్', పీరియాడిక్ డ్రామా 'పరాశక్తి', హిందీలో ఆషికి 3 వంటి సినిమాలలో నటిస్తుంది. అయితే, ఇన్నేసి సినిమాలు చేతిలో పెట్టుకున్న ఈ అమ్మడు.. అఖిల్ మూవీకి మాత్రం డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతుందంట.

ఇప్పటికే ఆమె కోసం పలుమార్లు షూటింగ్ పోస్ట్ పోన్ కూడా చేస్తూ వస్తున్నారంట మేకర్స్. ఇక ఇప్పుడు మరికొన్ని రోజుల టైమ్ కావాలని శ్రీలీల అడిగినట్లు సినీ వర్గాల టాక్. ఈ క్రమంలోనే శ్రీలీల కోసం వెయిట్ చేయడం కంటే, మరో హీరోయిన్తో షూటింగ్ చేయడానికి మేకర్స్ రెడీ అయినట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

లెనిన్ మూవీని మురళీ కిశోర్ అబ్బూరు డైరెక్ట్ చేస్తున్నాడు. వినరో భాగ్యము విష్ణు కథ అనే మూవీ ద్వారా అతడు పాపులర్ అయ్యాడు. రాయలసీమ రూరల్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అఖిల్ హీరోగా నటిస్తున్న 6వ చిత్రమిది.

ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచింది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ బ్యానర్లపై నాగార్జున, నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. దీపావళి సందర్భంగా నవంబర్‌‌‌‌లో సినిమా రిలీజ్‌‌కు ప్లాన్ చేస్తున్నారు.