Bosco Martis: ఎన్టీఆర్పై ప్రశంసలు కురిపించిన స్టార్ కొరియోగ్రాఫర్ బోస్కో

Bosco Martis: ఎన్టీఆర్పై ప్రశంసలు కురిపించిన స్టార్ కొరియోగ్రాఫర్ బోస్కో

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ దేవర. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో దేవరపై భారీ అంచనాలున్నాయి.

రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా మొదటి పార్ట్ 1 సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ సినిమా సాంగ్ షూటింగ్ థాయిలాండ్ లో జరుగుతోంది. ఈ పాటను బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిన్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈపాట షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిన్. ఇక ఆ ఫోటోకి ఎన్టీఆర్ చాలా టాలెంటెడ్ పర్సన్. ఆయనతో వర్క్ చేయడం ఎంతో ఆనందంగా ఉందంటూ.. రాసుకొచ్చాడు మార్టిన్. ప్రస్తుతం మార్టిన్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. 

ఇక దేవర సినిమా విషయానికి వస్తే.. ఎర్ర సముద్రం బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. అక్కడి కొంతమంది రాక్షసులు భయం అంటే ఏంటో తెలియకుండా.. సామాన్య జనాలను హింసిస్తూ ఉంటారు. వారికి అండగా ఉండటానికి, ఆ రాక్షసులకు భయాన్ని పరిచయం చేయడానికి దేవర నిలబడతారు. ఈ విషయాన్ని ఆ సినిమాలో వర్క్ చేసిన ఒక ఆర్టిస్ట్ వివరించారు. దాంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కి చేరుకున్నాయి. ఇక ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన మ్యూజిక్ నుండి వచ్చిన దేవర ఫైర్ సాంగ్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.