Nagarjuna, Prabhas: ప్రభాస్.. నీ ధైర్యానికి హ్యాట్సాఫ్.. కల్కి టీమ్పై నాగార్జున ప్రశంసలు

Nagarjuna, Prabhas: ప్రభాస్.. నీ ధైర్యానికి హ్యాట్సాఫ్.. కల్కి టీమ్పై నాగార్జున ప్రశంసలు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి 2898 ఏడీ సినిమా కోసం యావత్ భారతదేశం ఆడియన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇండియా నుండి వస్తున్న మొదటి హాలీవుడ్ రేంజ్ సినిమా కావడంతో ఇప్పుడు అందరి చూపులు ఈ సినిమాపై ఉన్నాయ్. ఇండియన్ మైథాలజీ, స్కైఫై బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా అదే రేంజ్ లో ఏర్పడుతున్నాయి. జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

అయితే.. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుండి ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ లో విజువల్స్, గ్రాఫిక్స్ నెక్స్ట్ లెవల్లో ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఈ ట్రైలర్ చూసి స్టార్స్ కల్కి టీమ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. గ్రేట్ విజువల్స్, హైలెట్ ప్రెజెంటేషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ లిస్టులో టాలీవుడ్ కింగ్ నాగార్జున చేరారు.

కల్కి సినిమా ట్రైలర్ చూశాక తన సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ఏం ప్రపంచాన్ని సృష్టించారు నాగీ. భారతదేశ అపురూపమైన కథలను మీరు తెరపైకి తీసుకోస్తున్నారు. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. అమిత్ జీ ఫైర్, కమల్ జీ జస్ట్ వావ్. ప్రభాస్.. ప్రయోగాలు చేసే నీ ధైర్యాన్ని నేను మెచ్చుకుంటున్నాను. ఇక నా అభిమాన నిర్మాత అశ్వినీ దత్, స్వప్న, స్వీటీకి శుభాకాంక్షలు. ఈ మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.. అని రాసుకొచ్చాడు నాగార్జున. ప్రస్తుతం ఆయన చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.