స్టార్ డైరెక్టర్ అట్లీతో సల్మాన్ ఖాన్..దబాంగ్‌ 4కి డైరెక్టర్ దొరికినట్టేనా!

స్టార్ డైరెక్టర్ అట్లీతో సల్మాన్ ఖాన్..దబాంగ్‌ 4కి డైరెక్టర్ దొరికినట్టేనా!

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) తన సినీ కెరీర్‌లో అనేక సూపర్‌హిట్ మూవీస్ వచ్చాయి. అందులో లవ్,యాక్షన్,పీరియాడిక్ కాన్సెప్ట్స్ తో సినిమాలు ఉన్నాయి. కానీ దబాంగ్ ఫ్రాంచైజీ మాత్రం అల్ టైం హిట్ అనిపించుకుంది. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు మూడు భాగాలు రిలీజ్ అయ్యాయి.

దబాంగ్ ఫ్రాంచైజీ ఆడియాన్స్కు సూపర్ కిక్ ఇచ్చాయి.దబాంగ్‌ ఫ్రాంఛైజీలో వచ్చిన మూడు చిత్రాల్లోనూ పోలీస్‌ అధికారి చుల్‌బుల్‌పాండేగా సల్మాన్‌ నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇక దబాంగ్4 (Dabangg 4) అప్డేట్ గురించి సల్మాన్ ఫ్యాన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..దబాంగ్ 4 ని సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అయితే, అట్లీ దబాంగ్ 4 డైరెక్టర్ అనే విషయంపై ఇంకా ఆఫీషియల్ అనౌన్స్ రాలేదు.కానీ డైరెక్టర్ అట్లీ..త్వరలో సల్మాన్‌తో కలిసి పని చేస్తున్నాడని చాలా కాలంగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అలాగే ఈ కాంబోలో వచ్చే మూవీ దబాంగ్ 4 అని..కామెడీ యాక్షన్ తో రాబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే..సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ కు డబుల్ డోస్ పక్కా అని తెలుస్తోంది. ఈ మూవీ క్రిస్మస్‌కు విడుదల కానుందని సమాచారం.

ALSO READ :- ప్రధాని మోదీని కలిసిన నితీష్ కుమార్

డైరెక్టర్ అట్లీ రీసెంట్ మూవీ జవాన్. ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామి స్పృష్టించింది. ప్రస్తుతం అట్లీ బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ 'బేబీ జాన్'ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి ఆయన డైరెక్షన్ మాత్రం చేయడం లేదు. మరోవైపు, సల్మాన్ ఖాన్ చివరిసారిగా టైగర్ 3 మూవీలో కనిపించాడు.