ప్రధాని మోదీని కలిసిన నితీష్ కుమార్

 ప్రధాని మోదీని కలిసిన నితీష్ కుమార్

బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.  బీహార్‌లో ఎన్‌డీఏతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన  తర్వాత ప్రధాని మోదీతో ఆయన భేటీ కావడం ఇదే తొలిసారి. నితీష్ కుమార్ ప్రభుత్వం ఫిబ్రవరి 12వ తేదీన బలపరీక్షను ఎదురుకోనుంది.  అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నితీష్ కుమార్ ప్రధాని మోదీని కలిశారు.  

ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను ప్రధాని కార్యాలయం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ భేటీలోఇద్దరు నేతలూ ఆప్యాయంగా పలకరించుకున్నారు.  ప్రధాని మోదీకి సీఎం నితీశ్ పుష్పగుచ్ఛం అందించారు.  ఈ సందర్భంగా 9వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్‌ను మోదీ అభినందనలు తెలిపారు.   

మరోవైపు నితీశ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా , బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను కూడా కలవనున్నారు. లోక్‌సభ ఎన్నికలు, మంత్రివర్గ విస్తరణపై నేతల మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది.   గత లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. బీహార్‌లో 40 లోక్‌సభ స్థానాలు ఉండగా... జేడీయూ, బీజేపీలు 17 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టాయి. బీజేపీ 17 సీట్లు, జేడీయూ 16 సీట్లు గెలుచుకున్నాయి.

ALSO READ :- ఫారెస్ట్ భూముల్లో నిర్మాణాలు.. ధ్వంసం చేసిన అధికారులు