పొదుపుగా వాడుకోండి: హైదరాబాద్‎లోని ఈ ఏరియాల్లో ఇవాళ (మార్చి 9) నీటి సరఫరా బంద్

పొదుపుగా వాడుకోండి: హైదరాబాద్‎లోని ఈ ఏరియాల్లో ఇవాళ (మార్చి 9) నీటి సరఫరా బంద్

హైదరాబాద్‎లోని నార్సింగి, మణికొండ, షేక్‌పేట్ ప్రాంతాల్లో సోమవారం (మార్చి 9) మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని జల మండలి అధికారులు తెలిపారు. సింగూరు నుంచి సరఫరా అయ్యే 1200 ఎంఎం డయా పీఎస్సీ గ్రావిటీ మెయిన్ పైప్‌లైన్ దెబ్బతిన్నది. 

బుల్కాపూర్ దగ్గర సోమవారం ఉదయం 5 గంటలకు పైప్‌లైన్‎కు భారీ లీకేజీ ఏర్పడింది. లీకేజీని అరికట్టేందుకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు అధికారులు. రాత్రి 10 గంటల వరకు మరమ్మతు పనులు పూర్తి అయ్యే అవకాశం ఉందని తెలిపారు. 

ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో ప్రెజర్‌తో నీటి సరఫరా జరగనుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో పూర్తిగా వాటర్ సప్లైలో అంతరాయం ఏర్పడనుందని చెప్పారు. ఈ ప్రాంతాల ప్రజలు మంచినీటిని పొదుపుగా వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. 

నీటి అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:

  • మణికొండ 
  • నార్సింగి 
  • షేక్‌పేట్
  • హకీంపేట్
  • టోలిటౌకీ
  • కాకతీయ నగర్‌
  •  మెహిదీపట్నం
  •  ఆసిఫ్ నగర్
  •  కార్వాన్

  •