Ishan Kishan: స్టేడియంలోనే గర్ల్ ఫ్రెండ్ని ముద్దు పెట్టుకున్న ఇషాన్..

Ishan Kishan: స్టేడియంలోనే గర్ల్ ఫ్రెండ్ని ముద్దు పెట్టుకున్న ఇషాన్..

Ishan Kishan: టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన తర్వాత జరిగిన వేడుకలలో భారత క్రికెటర్ ఇషాన్ కిషన్ తన గర్ల్‌ఫ్రెండ్ అదితి హుండియాను స్టేడియంలోనే ముద్దు పెట్టుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోను షేర్ చేస్తూ నెటిజన్స్ ఈ జంట ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకున్నారని ప్రచారం చేస్తున్నారు. మ్యాచ్ అనంతరం జరిగిన వేడుకలలో ఇషాన్ కిషన్, అదితి హుందియా ఆ విధంగా కనిపించినట్టు ఎక్కడ కూడా అలాంటి ఫోటోలు కానీ వీడియోలు కనిపించలేదు. 

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఇలాంటి ఫోటోలు చాలాసార్లు డీప్ ఫేక్ ద్వారా మార్చినట్లుగా ఫ్యాక్ట్ చెక్ ఆఫ్ ఇండియా తెలిపింది. కొన్ని సందర్భంలో తీసిన చిత్రాలను తప్పుగా ప్రచారం చేస్తున్నట్లు పేర్కొనింది. ప్రముఖ వ్యక్తులు, క్రికెటర్లపై ఇలాంటి తప్పుడు పోస్టులు సృష్టించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఈ మధ్య సాధారణం అయిపోయిందన్నారు. అందువల్ల టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇషాన్ కిషన్, అదితి హుందియాను కిస్ చేసుకున్నారనే తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని పేర్కొనింది. 

ఆదివారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై 96 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత జరిగిన సంబరాలు కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతకు దారితీశాయి. మధ్యప్రదేశ్‌లోని సాయాజీ గేట్ సమీపంలో జరిగిన సెలబ్రేషన్స్ లో ఒక పోలీసు కానిస్టేబుల్ గాయపడ్డాడు. టమిండియా ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని పటాకులు కాల్చుతూ, జెండాలు ఊపుతూ నినాదాలు చేశారు. ఈ సమయంలో ఒక పటాకా పోలీసు కానిస్టేబుల్ దగ్గర పేలడంతో అతను గాయపడ్డాడు. దీంతో అక్కడ కాసేపు గందరగోళం ఏర్పడింది.  పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు.