ఫారెస్ట్ భూముల్లో నిర్మాణాలు.. ధ్వంసం చేసిన అధికారులు

ఫారెస్ట్ భూముల్లో నిర్మాణాలు.. ధ్వంసం చేసిన అధికారులు
  •  ఇల్లందు మండలంలో ఉద్రిక్తత 
  • తమ భూమే అంటున్న బాధితులు

హైదరాబాద్​: ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం పోలపల్లి సమీపంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కౌన్సిలర్ కు చెందిన భూములపై ఫారెస్ట్ అధికారుల దాడులు చేశారు.  అటవీ భూములు ఆక్రమించారని పేర్కొంటూ  ఇల్లందు బీఆర్ఎస్​ కౌన్సిలర్​ కొండపల్లి సరిత, కొండపల్లి మనీలాకు చెందిన భూముల్లో  ఉన్న కట్టడాలను  అధికారులు కూల్చివేశారు.

అటవీ భూముల్లో కోళ్ల ఫాం, మామిడి తోట వేశారని అధికారులు ఆరోపించారు. వాటిని అధికారులు ధ్వంసం చేశారు.  సర్వే నంబర్​ 549 లో 20 ఎకరాలు ఫారెస్ట్​ పరిధిలో ఉందని అధికారులు తెలిపారు.  అయితే తమ వద్ద భూమిపై హక్కు పత్రాలు ఉన్నాయని  కౌన్సిలర్​ కొండపల్లి సరిత తెలిపారు. తమ పట్ల అధికారులు కక్షపూరితంగా వ్యవహరించి దాడులు చేశారని మండిపడ్డారు.

నిన్న రాత్రి సర్వే పేరుతో కొండపల్లి భూముల మీదికి అధికారులు  వెళ్లిన క్రమంలో కొండపల్లి కుటుంబం అడ్డుకున్నది. దీంతో ఆందోళన తీవ్రతరం కావడంతో  ఫారెస్ట్ అధికారులు వెనుతిరిగారు. ఇవాళ ఉదయాన్నే పోలీస్ ఫోర్స్ తో  కోళ్ల ఫారంపై దాడులు ప్రారంభించారు.

ALSo READ :- 800 మందికిపైగా కారుణ్య నియామకాలు

ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు అవిశ్వాస తీర్మానంలో  కొండపల్లి సరిత భర్త గణేశ్​ కీలక పాత్ర పోషించి.. కాంగ్రెస్ పార్టీ నేతలను మంత్రులను  ముప్పు తిప్పలు పెట్టిన నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది.