టెన్త్లో వంద శాతం రిజల్ట్ కోసం కృషి చేయాలి : కలెక్టర్ జితేశ్

టెన్త్లో వంద శాతం రిజల్ట్ కోసం కృషి చేయాలి : కలెక్టర్ జితేశ్
  • భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ​జితేశ్​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పదో తరగతిలో నూరు శాతం రిజల్ట్​ కోసం టీచర్లు కృషి చేయాలని కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్ ​సూచించారు. షెడ్యూల్డ్​ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని షెడ్యూల్డ్​ కులాల వసతి గృహాల్లో చదువుతున్న పదో తరగతి స్టూడెంట్స్​కు కొత్తగూడెం క్లబ్​లో ఆదివారం నిర్వహించిన ప్రేరణ, శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడారు. విద్య అనేది జీవితాన్ని మార్చే ప్రధాన ఆయుధమన్నారు. 

పదో తరగతిలో వచ్చే మార్కులు మాత్రమే జీవిత విజయానికి కొలమానం కాదని, నిర్ధేశించుకున్న లక్ష్యాలను సాధించి సమాజంలో స్థిరపడినప్పుడే నిజమైన విజయం లభించినట్లవుతోందని చెప్పారు. క్రమశిక్షణ, పట్టుదలతో చదివితే విజయాలు సొంతమవుతాయన్నారు. ఎస్సీ స్టూడెంట్స్​ సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. సబ్జెక్టు నిపుణులు స్టూడెంట్స్​కు ఆయా సబ్జెక్టులపై స్టూడెంట్స్​కు అవగాహన కల్పించారు. ఈ ప్రోగ్రాంలో జిల్లా షెడ్యూల్డ్​ కులాల అభివృద్ధి శాఖాధికారి ఎ. శ్రీల, సహాయ సంక్షేమ అధికారులు హనుమంతరావు, అక్షయ్ పాల్గొన్నారు. 

మాస్కుల తయారీలో ఉచిత శిక్షణ

ములకలపల్లి : నాయకపోడు సంస్కృతి, సంప్రదాయ కళలకు ప్రతిబింబమైన మాస్కుల తయారీపై నిరుద్యోగ యువతీ యువకులకు ‘గురు శిష్య హస్త శిల్ప ప్రశిక్షణ’ కార్యక్రమం ద్వారా రెండు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ జితేశ్​ ప్రకటించారు. ఆదివారం ములకలపల్లి మండలం మాదారం గ్రామంలోని మాస్కుల తయారీ యూనిట్‌ను ఆయన సందర్శించారు. సోమవారం నుంచే 30 మంది యువతీ యువకులతో ఈ శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు. 

 శిక్షణకు హాజరయ్యే వారికి రోజూ రూ. 300- చొప్పున స్కాలర్‌షిప్ అందిస్తామని, శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత స్వయం ఉపాధి లేదా ఆదాయాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని డీఆర్‌డీఏ ఏపీఎం రామ్ కుమార్, సీసీ ఉపేందర్ పర్యవేక్షిస్తారని చెప్పారు.