Team India: టీ20 వరల్డ్ కప్ 2026 గెలిచిన తర్వాత మరోసారి చరిత్ర సృష్టించిన భారత జట్టు ఇప్పుడు కొంత విరామం తీసుకోనుంది. స్వదేశంలో జరిగిన ఈ టోర్నీలో టైటిల్‌ను కాపాడుకున్న టీమిండియా వరుసగా మూడోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే ఇప్పుడు ప్లేయర్స్ అందరూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌పై నజర్ పెట్టారు. ఈ టోర్నీ మార్చి 28వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్ నుంచి ఇండియన్ టీమ్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లతో మళ్లీ బిజీ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇకపై టీమిండియా దృష్టి ప్రధానంగా 2027 వన్డే వరల్డ్ కప్ పై పడింది. దాంతో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025–27 ఫైనల్ కి చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది.
అఫ్గానిస్తాన్‌తో తొలి సిరీస్:
ఐపీఎల్ తర్వాత జూన్‌లో భారత్– ఆఫ్ఘనిస్తాన్‌తో ఒక టెస్ట్– మూడు వన్డేలు ఆడనుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి జట్లతో వరుసగా సిరీస్‌లు కొనసాగుతాయి. భారత్‌కు 2026–27 కాలంలో కొన్ని కీలక టోర్నీలు ఉన్నాయి. ముఖ్యంగా న్యూజిలాండ్ టూర్, బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ (ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్) అనంతరం ఆసియా కప్ టోర్నమెంట్ కీలకంగా మారనుంది.
టీమిండియా షెడ్యూల్:
భారత్ లో ఆఫ్ఘనిస్తాన్ టూర్
* మ్యాచ్‌లు: 1 టెస్ట్, 3 వన్డేలు
* తేదీలు: జూన్ 6 – జూన్ 20, 2026
* వేదిక: భారత్
ఇంగ్లాండ్ లో భారత్ పర్యటన:
* మ్యాచ్‌లు: 5 టీ20లు, 3 వన్డేలు
* తేదీలు: జూలై 1 – జూలై 19, 2026
ఇండియా టూర్ ఆఫ్ శ్రీలంక:
* మ్యాచ్‌లు: 2 టెస్టులు, 2 టీ20లు
* తేదీలు: ఆగస్టు 2026
ఇండియా టూర్ ఆఫ్ బంగ్లాదేశ్
* మ్యాచ్‌లు: 3 వన్డేలు, 3 టీ20లు
* తేదీలు: సెప్టెంబర్ 1 – సెప్టెంబర్ 13, 2026
ఇండియా టూర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్:
* మ్యాచ్‌లు: 3 టీ20లు
* తేదీలు: సెప్టెంబర్ 2026
ఏషియన్ గేమ్స్ 2026:
* ఫార్మాట్: టీ20
* తేదీలు: సెప్టెంబర్ 19 – అక్టోబర్ 4
* వేదిక: జపాన్
వెస్టిండీస్ టూర్ ఆఫ్ ఇండియా:
* మ్యాచ్‌లు: 3 వన్డేలు, 3 టీ20లు
* తేదీలు: అక్టోబర్ 2026
* వేదిక: భారత్
ఇండియా టూర్ ఆఫ్ న్యూజిలాండ్:
* మ్యాచ్‌లు: 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు
* తేదీలు: అక్టోబర్ – నవంబర్ 2026
* వేదిక: న్యూజిలాండ్
శ్రీలంక టూర్ ఆఫ్ ఇండియా:
* మ్యాచ్‌లు: 3 వన్డేలు, 3 టీ20లు
* తేదీలు: డిసెంబర్ 2026 – జనవరి 2027
* వేదిక: భారత్
బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ (ఇండియా vs ఆస్ట్రేలియా)
* మ్యాచ్‌లు: 5 టెస్టులు
* తేదీలు: జనవరి – ఫిబ్రవరి 2027
* వేదిక: భారత్
కీలక టోర్నీలు
* వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ – జూన్ 2027 (అర్హత సాధిస్తే)
* ఆసియా కప్ 2027 (వన్డే ఫార్మాట్) – జూలై 2027, బంగ్లాదేశ్
* క్రికెట్ వరల్డ్ కప్ 2027 – అక్టోబర్–నవంబర్ 2027, దక్షిణాఫ్రికా/జింబాబ్వే/నమీబియా
