తెలంగాణ పోలీస్ రిట్రీట్ 2026 ముగింపు వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. సోమవారం ( మార్చి 9 ) జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. 2002 తర్వాత ఇలాంటి రిట్రీట్ వేడుకలు నిర్వహించామని.. నూతన సవాళ్లపై పోలీసులు చర్చించారని తెలిపారు సీఎం రేవంత్. గత డిసెంబర్ లోనే ఈ కార్యక్రమం చేద్దామనుకున్నామని అన్నారు సీఎం రేవంత్. ఢిల్లీ అత్యంత కాలుష్యమైన నగరంగా ఉందని.. బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు అందరికీ తెలుసనీ.. అందుకే ఐటీ కంపెనీలన్నీ హైదరాబాద్ కు వస్తున్నాయని అన్నారు సీఎం రేవంత్.
దేశ జీడీపీలో తెలంగాణ 5 శాతం మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తోందని..దేశంలో అత్యధిక అభివృదీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దాలి అదే మా టార్గెట్ అని అన్నారు. డిల్లీ ప్రధాన సమస్య కాలుష్యం ఎదుర్కొంటోందని..పార్లమెంట్ నుండి స్కూల్ వరకు అన్ని సెలవులు ప్రకటించే పరిస్తితి వచ్చిందని అన్నారు. ముంబాయి, చెన్నై బెంగుళూరు లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని... మెట్రో పాలిటెన్ సిటిస్ వదిలి హైదరాబాద్ కు పెట్టుబదులు వస్తున్నాయని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
►ALSO READ | మల్లేపల్లి ATCలో కొత్త కోర్సులు... ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి..
రెండు సెమీ వర్షం పడితే హైదరాబాద్ తట్టుకునే పరిస్తితి లేదని.. సిస్టమ్ ఫేస్ చేసే పరిస్థితిలో లేమని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు సహాయం కోసం చూసేది పోలీసుల కోసమేనని..పోలీస్ వ్యవస్త బ్లేమ్ అవుతుందని అన్నారు. పోలీస్ రెడీగా ఉండాలని.. నూతన సమస్యలు ఎదుర్కోవాలని అన్నారు సీఎం రేవంత్.
రాష్ట్రంలో ఫిజికల్ క్రైమ్ తగ్గి, సైబర్ క్రైమ్ పెరిగిందని.. నేర స్వభావం మారిందని అన్నారు సీఎం రేవంత్. దేశంలో ఎక్కడ అయినా సరే సైబర్ నేరగాడు నేరం చేయవచ్చని.. పోలీసులు కూడా అప్ గ్రేడ్ అయ్యి సమస్య పరిష్కరించాలని అన్నారు సీఎం రేవంత్. సైబర్ క్రైమ్ లో డిజిటల్ ఎవిడెన్స్ 99 ప్రూఫ్ అవసరమని..నైపుణ్యం గల అధికారులు లేకుండా పోయారని.. అలాంటి ఇబ్బంది లేకుండా అప్ గ్రేడ్ అవ్వాలని అన్నారు సీఎం రేవంత్.
