మల్లేపల్లి ఐటీఐలోని ఏటీసీలో కొత్త షార్ట్ టర్మ్ కోర్సులు ప్రారంభించారు. సీఎన్‌సీ మెషిన్ ఆపరేషన్, రోబోటిక్స్, ఈవీ టెక్నాలజీ, 2D, 3D ప్రొడక్ట్ డిజైనింగ్ కోర్సులు ప్రవేశపెట్టారు. సోమవారం ( మార్చి 9 ) జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్. సీఎం రేవంత్ రెడ్డి ప్రజల దగ్గరికి వెళ్లాలానే ఆలోచనతో 99 రోజుల ప్రణాళిక కార్యక్రమం తీసుకున్నారని.. 99 రోజుల ప్రణాళికలో తీసుకున్న నిర్ణయాలు ఇంప్లిమెంట్ చేస్తామని అన్నారు.
చాలా మంది ఇండస్ట్రీస్ వాళ్లు స్కిల్ ఉన్నవాళ్లు లేరని చెప్తున్నారని.. పరిశ్రమలకు అవసరం ఉన్న స్కిల్స్ పై స్టూడెంట్స్ కి ట్రయినింగ్ ఇవ్వాలని చెప్పామని అన్నారు. పరిశ్రమలకు అవసరమైన స్కిల్ సెట్ ను అమలు చేయాలని..గ్రామీణ ప్రాంతాల్లో టాటా టెక్నాలజీ భాగస్వామ్యంతో వ్యవసాయ అనుబంధం రంగాల కోర్సులు తొందరలోనే మొదలు పెడతామని అన్నారు మంత్రి వివేక్. ప్రపంచంలో అగ్రికల్చర్ తో పోల్చితే మన ప్రొడక్టివిటీ తక్కువ ఉందని.. తొందరలోనే అగ్రి అలైడ్ సెక్టార్ కోర్సులు మొదలు పెడతామని అన్నారు.
►ALSO READ | ఖమ్మం ZP సెంటర్ దగ్గర ఉద్రిక్తత... కవిత అరెస్ట్..
జీనోమ్ వ్యాలిలో కూడా అవసరమైనా కోర్సులు మొదలు పెడతామని..పరిశ్రమలకు అవసరమైన స్కిల్ సెట్స్ పై విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తామని అన్నారు. మన విద్యార్థులకు మల్టి స్కిల్ సెట్స్ అవసరమని..మల్టీ స్కిల్ సెట్స్ నేర్చుకుంటేనే ఉద్యోగాల్లో లాభం ఉంటుందని అన్నారు.మన ఏటీసీల నుండి స్టూడెంట్స్ బయటకు వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు వచ్చే విధంగా ఉండాలని ప్రిన్సిపాల్స్ కి చెప్తూ ఉంటానని.. మనం ఎప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి ఉండాలని అన్నారు మంత్రి వివేక్.
టామ్ కామ్ ద్వారా విద్యర్థులకు బయటి దేశాలకు పంపించడానికి స్కిల్స్ నేర్పిస్తున్నామని..విదేశాల్లో ఎక్కువ జీతాలు ఉంటాయి.. కుటుంబాలను మంచిగా చూసుకుంటారని అన్నారు. ఏటీసీ ల నుండి 25 వేల మంది విద్యార్థులు బయటకు వస్తున్నారని... భవిష్యత్ లో జిల్లాలో కూడా జాబ్ మేళాలో పెడతామని అన్నారు.
