హైడ్రా యాక్షన్.. కమ్యూనిటీ వాసుల రియాక్షన్.. హైదరాబాద్ బాచుపల్లిలో రచ్చరచ్చ !

హైడ్రా యాక్షన్.. కమ్యూనిటీ వాసుల రియాక్షన్.. హైదరాబాద్ బాచుపల్లిలో రచ్చరచ్చ !

హైదరాబాద్: బాచుపల్లిలో కమ్యూనిటీ గోడ కూల్చివేతపై ఉద్రిక్తత నెలకొంది. మేడ్చల్ జిల్లా  బాచుపల్లిలో ఉన్న ప్రణీత్ ఆంటీలియా గ్రేటర్ కమ్యూనిటీ గోడను హైడ్రా అధికారులు కూల్చివేయడంపై కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముందస్తు సమాచారం లేకుండా వచ్చి గోడను కూల్చివేయడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కాలనీని గ్రేటర్ కమ్యూనిటీగా గుర్తించి మున్సిపల్ అధికారులు పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ, ఇప్పుడు గోడను తొలగించడం వల్ల భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నివాసితులు చెబుతున్నారు.

ALSO READ : హైదరాబాద్‎లో జుట్టు ఎక్కువ ఉందని విద్యార్ధికి గుండు కొట్టించిన ప్రిన్సిపాల్

అధికారులు గోడను తొలగించి అక్కడి నుంచి ఎగ్జిట్–4 వరకు రహదారి ఏర్పాటు చేస్తామని చెప్పడం తమను మరింత ఆందోళనకు గురిచేస్తోందని కాలనీ వాసులు తెలిపారు. నివాసితులతో చర్చించకుండా, ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఈ చర్యలు తీసుకోవడం సరైంది కాదని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.