హైదరాబాద్‎లో జుట్టు ఎక్కువ ఉందని విద్యార్ధికి గుండు కొట్టించిన ప్రిన్సిపాల్

హైదరాబాద్‎లో జుట్టు ఎక్కువ ఉందని విద్యార్ధికి గుండు కొట్టించిన ప్రిన్సిపాల్

హైదరాబాద్: జట్టు ఎక్కువగా ఉందని విద్యార్థికి ప్రధానోపాధ్యాయుడు గుండు కొట్టించాడు. దేవుడి మొక్కు ఉండగా తమ కుమారుడికి గుండు కొట్టించడంపై స్కూల్ ముందు విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన హైదరాబాద్‎లోని హఫీజ్ పేట్‎లో వెలుగు చూసింది. 

వివరాల ప్రకారం.. ప్రేం నగర్ బీ బ్లాక్‎లోని బ్లాక్ బోర్డు ది స్కూల్‎లో ఈశ్వర్ అనే బాలుడు తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. జుట్టు ఎక్కువగా ఉండటంతో కటింగ్ చేయించుకోవాలని ఈశ్వర్‎కు ప్రిన్సిపాల్ సూచించాడు. అయితే.. లక్ష్మీ నరసింహా స్వామికి మొక్కు ఉందని ఈశ్వర్‎ చెప్పాడు. 

ALSO READ : ఆ రెండు దేశాల్లో కరోనా నాటి పరిస్థితులు..

అయినప్పటికీ ఈశ్వర్‎కు బలవంతంగా ప్రిన్సిపాల్ గుండు కొట్టించాడు. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి మొక్కు ఉందని చెప్పనప్పటికీ తమ పిల్లాడికి బలవంతంగా గుండు ఎలా కొట్టిస్తారని విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. దీంతో స్కూల్ ముందు ఉద్రిక్త నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగి వివాదాన్ని పరిష్కరించారు.