కోట్ల ఆస్తి ఉన్నా.. ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోని ఆ ఎంపీలు వీరే!

కోట్ల ఆస్తి ఉన్నా.. ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోని ఆ ఎంపీలు వీరే!

సాధారణంగా ఎంపీలు జీతాలు, అలవెన్సులు పెంచాలని కోరుతుంటారు. కానీ ప్రస్తుత లోక్‌సభలో ఇద్దరు ఎంపీలు మాత్రం  జీతాన్ని వదులుకుని ఆదర్శంగా నిలిచారు. వీరిలో ఒకరు బీజేపీ ఎంపీ కాగా, మరొకరు కాంగ్రెస్ ఎంపీ.  సమాచారం ప్రకారం, జీతం తీసుకోకూడదని నిర్ణయించుకున్న ఎంపీలు  హర్యానాలోని కురుక్షేత్ర  బిజెపి ఎంపీ నవీన్ జిందాల్,   మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ బిమోల్ అకోయిజామ్ అంగోమ్చా

నవీన్ జిందాల్ ప్రత్యేకత ఏంటంటే ?
ఈ ఇద్దరిలో నవీన్ జిందాల్ ఒక అడుగు ముందుకేసి.. కేవలం జీతం మాత్రమే కాదు, ప్రభుత్వం ఇచ్చే ఏ ఒక్క పైసా ప్రోత్సాహకం లేదా అలవెన్స్‌లను కూడా తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. ఇలా ఏ రకమైన ప్రభుత్వ ప్రయోజనాలను ఆశించని ఏకైక ఎంపీగా ఆయన నిలిచారు.

►ALSO READ | క్రూడ్ ఆయిల్ ఒక్క డాలర్ పెరిగితే.. భారత్‌పై రూ.12వేల 600 కోట్లు భారం.. 50 డాలర్లు పెరిగితే పరిస్థితి ఊహించుకోండి..!
 
ఈ ఇద్దరు ఎంపీల ఆస్తుల వివరాలు చూస్తే చాలా తేడా కనిపిస్తుంది. నవీన్ జిందాల్ మొత్తం ఆస్తులు సుమారు రూ.1,241 కోట్లు. డాక్టర్ బిమోల్ అకోయిజామ్ ఆస్తులు సుమారు రూ.97 లక్షలు. అంటే ఒకరు అత్యంత ధనవంతుడు కాగా, మరొకరు సాధారణ మధ్యతరగతి ఆర్థిక నేపథ్యం ఉన్న వ్యక్తి. అయిన ఇద్దరూ జీతం వద్దనుకోవడం విశేషం.

లోక్‌సభలో అత్యంత ధనవంతులు ఎవరు?
నవీన్ జిందాల్ వందల కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తి అయిన  ఆయన కంటే ధనవంతులు కూడా లోక్‌సభలో ఉన్నారు. గుంటూరు టీడీపీ ఎంపీ  డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని  రూ5,705 కోట్లకు పైగా ఆస్తులతో అగ్రస్థానంలో ఉన్నారు.  జిందాల్ సంపద కంటే నాలుగు రెట్లు ఎక్కువ. చేవెళ్ల బీజేపీ ఎంపీ  కొండా విశ్వేశ్వర్ రెడ్డిరూ.4,568 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం లోక్‌సభలో 481 మంది సభ్యులు ప్రభుత్వం నుండి జీతాలు తీసుకుంటున్నారు. మొత్తం 543 సీట్లలో 2 ఖాళీగా ఉన్నాయి. మిగిలిన కొందరి వివరాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.