అగ్గిపెట్టెలో ఇమిడే శాలువా..కొండగట్టు అంజన్నకు చేనేత కార్మికుడి అరుదైన కానుక

అగ్గిపెట్టెలో ఇమిడే శాలువా..కొండగట్టు అంజన్నకు  చేనేత కార్మికుడి అరుదైన కానుక

కొండగట్టు, వెలుగు: కొండగట్టు ఆంజనేయస్వామికి ఓ చేనేత కార్మికుడు అరుదైన బహుమతి అందజేశాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ అగ్గిపెట్టెలో ఇమిడేంత చిన్న పరిమాణంలో ప్రత్యేక శాలువాను తయారు చేసి స్వామివారికి సమర్పించాడు. ప్రత్యేక సన్నని నూలుదారంతో అత్యంత నైపుణ్యంతో నేసిన ఈ శాలువాను హరిప్రసాద్ మంగళవారం కొండగట్టు ఆలయ అధికారులకు, అర్చకులకు అందజేశారు. ఆలయ అధికారులు, అర్చకులు హరిప్రసాద్‌‌ను సన్మానించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ చంద్రశేఖర్, అర్చకులు చిరంజీవి, కపీండర్ పాల్గొన్నారు.