హైదరాబాద్, వెలుగు: ములుగు జిల్లాలోని సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన యూనివర్సిటీలో పీజీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎంఏ పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్ కోర్సులో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు యూనివర్సిటీ అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ జి. రాంరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేటి నుంచి 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సమర్థ్ అడ్మిషన్ పోర్టల్ https://ssctuadm.samarth.edu.in ద్వారా అప్లై చేయాలని సూచించారు.
