హైదరాబాద్‌సిటీ, వెలుగు: దక్షిణ మధ్య రైల్వేలో చీఫ్ కమర్షియల్ మేనేజర్(ప్యాసింజర్ సర్వీసెస్ & ప్యాసింజర్ మార్కెటింగ్)గా బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్ బి.ఎస్. క్రిస్టోఫర్ మంగళవారం ఉద్యోగ విరమణ చేశారు. ఆయన 1993లో ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్‌లో తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
తర్వాత రాజీనామా చేసి, 1994లో ఢిల్లీ-, అండమాన్ నికోబార్ సివిల్ సర్వీసెస్‌లో పని చేశారు. ఢిల్లీలో 6 నెలలపాటు సబ్ -డివిజినల్ మేజిస్ట్రేట్‌గా చేసి, 1999లో దక్షిణ మధ్య రైల్వేలో చేరారు. నాందేడ్ డివిజన్ మినహా అన్ని డివిజన్లలో వివిధ హోదాల్లో పని చేశారు.
