జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ నెల ( 2026 జులై) వృషభ రాశి వారు వ్యక్తిగతంగా కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుందని పండితులు చెబుతున్నారు. జన్మరాశిలో కుజుని సంచారం వలన ఏ విషయంలో కూడా తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని సూచిస్తున్నారు. కోపాన్ని.. ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. కేతువు సంచారం వలన తెలియని ఆందోళన, భయం కలిగే అవకాశం ఉంది. అయితే గురుడి శుభ దృష్టి వలన ఈ రాశి వారు ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు.
వృషభ రాశి జులై 2026 నెలలో ఎవరికి ఎలాంటి హామీలలు చేయడం.. వాగ్ధానాలు ఇవ్వడం వంటివి చేయకపోవడం చాలా మంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పిల్లలు కొద్ది శ్రమతో ఆశించిన ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచి తూచి అడుగు వేయడం మంచిది. కుటుంబసమేతంగా ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు.
వృషభ రాశి వారికి ఈ నెలలో శని, శుక్రుడు అనుకూలత వల్ల చాలావరకు సంతృప్తికరంగాఉంటుంది. ఉద్యోగస్తులకు చివరి 15 రోజులు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. చేతి వృత్తుల వారికి ఆశించిన స్థాయిలో సంపాదన వృద్ధి చెందుతుంది. కొత్త ప్రాజెక్ట్‌లు చేపట్టే అవకాశం ఉంది. మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది.
వ్యాపారస్తులకు గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు పొందుతారు. ఇక పెళ్లి సంబంధాల కోసం ఎదురు చూసే వారికి ఉన్నత కుటుంబానికి చెందిన వారితో సంబంధం కుదిరే అవకాశం ఉంది. కొన్ని విషయాలలో అపార్థాలు తొలగిపోయి, బంధాలు బలపడతాయి . వాదనలకు దూరంగా ఉండటం ...భాగస్వామితో సర్దుకుపోవడం వల్ల ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. మిత్రుల మూలంగా కొద్దిగా డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించడం వల్ల దోషాలు తొలగి శుభాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
