హైదరాబాద్: ‘సర్’ను పరిశీలించిన కలెక్టర్

హైదరాబాద్: ‘సర్’ను పరిశీలించిన కలెక్టర్

హైదరాబాద్ సిటీ/మెహిదీపట్నం, వెలుగు : సర్ ప్రక్రియలో భాగంగా మంగళవారం కార్వాన్ సెగ్మెంట్, గోల్కొండ  పరిధిలోని 277వ పోలింగ్ బూత్‌లో బీఎల్ఓల ద్వారా జరుగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల పరిశీలించారు. ఈ ప్రక్రియను ఏఈఆర్ఓలు పర్యవేక్షించాలన్నారు. కార్వాన్ నియోజకవర్గంలోని 41 పోలింగ్ కేంద్రాల పరిధిలో దాదాపు 40 శాతం ఎన్యూమరేషన్ పత్రాలను బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి విజయవంతంగా అందజేశారన్నారు.

తహసీల్దార్ ఎ. ప్రవీణ్, నోడల్ ఆఫీసర్​నవీన్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు. అనంతరం షేక్ పేట సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్​స్టిట్యూట్​(బాయ్స్​జేసీ స్కూల్) ను కలెక్టర్​విజిట్​చేశారు. కాలేజీ డైనింగ్ హాల్​లో స్టూడెంట్స్​తో కలసి సహపంక్తి  భోజనం చేశారు. ప్రిన్సిపాల్ బాలస్వామి  పాల్గొన్నారు.