బెంగళూరులో హోటల్స్, రెస్టారెంట్స్ మొత్తం బంద్.. గ్యాస్ సప్లై నిలిచిపోవడమే కారణం !

బెంగళూరులో హోటల్స్, రెస్టారెంట్స్ మొత్తం బంద్.. గ్యాస్ సప్లై నిలిచిపోవడమే కారణం !

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం బెంగళూరులో హోటల్ బిజినెస్పై తీవ్ర ప్రభావం చూపింది. ఈ యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఈ పరిణామంతో బెంగళూరులోని హోటల్స్పై భారీ దెబ్బ పడింది. బెంగళూరులో మంగళవారం (మార్చి 10, 2026) నుంచి హోటల్స్ మూసివేస్తున్నట్లు బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ ప్రకటించింది.

కమర్షియల్ కుకింగ్ గ్యాస్ కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ తెలిపింది. దాదాపుగా కమర్షియల్ గ్యాస్ సప్లై నిలిచిపోయిందని.. ఇక హోటల్స్ బంద్ చేయడం తప్ప మరో మార్గం కనపడలేదని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ నిట్టూర్చింది.

►ALSO READ | గ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్‌పై కొత్త రూల్ తెచ్చిన కేంద్ర ప్రభుత్వం

ఇక హైదరాబాద్ విషయానికొస్తే.. ఒక్క హైదరాబాద్​లోనే నెలకు 6 నుంచి 6.5 లక్షల కమర్షియల్ సిలిండర్లు విక్రయాలు జరుగుతాయి. టీ స్టాల్‌‌‌‌‌‌‌‌లు నుంచి స్టార్​ హోటళ్ల వరకు నెలకు 4 నుంచి 5.50 లక్షల సిలిండర్లకు అవసరం ఉంటుంది. ఇండస్ట్రీలకు మరో 1.50 లక్షలు అదనంగా డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఉంది. 

ఈ మొత్తం కమర్షియల్ సేల్స్ విలువ నెలకు రూ.140 నుంచి  రూ.150 కోట్లకు చేరుతుందని గ్యాస్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. బల్క్ ట్యాంకర్ల సరఫరా ఇప్పటికే నిలిచిపోయింది. రేపోమాపో బెంగళూరు సిటీలో హోటల్స్ బంద్ అవుతున్నట్లు హైదరాబాద్ సిటీలో కూడా హోటల్స్ మూసివేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న హోటల్ ఓనర్లు చెప్పుకొచ్చారు.