AI టెక్నాలజీతో అద్భుతాలు సృష్టించగలిగే స్థాయికి చేరుకున్నాడు మనిషి. ప్రతి రంగంలో AI విప్లవాత్మక మార్పులు తెస్తోంది. ఇదంతా నాణేనికి ఒకవైపే... మరో వైపు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఏళ్ళ నాటి నమ్మకాల నుంచి బయటపడలేక పోతున్నారు జనం. దేవుడే బతికిస్తాడంటూ ఓ బాలింత వైద్యాన్ని అడ్డుకున్నారు గిరిజనులు. ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ఆదిలాబాద్ జిల్లా గుడిహథ్నూర్ మండలం చెరుకువాయి గ్రామంలో దారుణం జరిగింది. రక్తహీనతతో బాధపడుతున్న బాలింత వైద్యం వైద్యాన్ని అడ్డుకున్నారు గిరిజనులు.
చెరుకువాయి గ్రామానికి చెందిన మారుబాయి అనే బాలింత రక్తహీనతతో బాధపడుతోంది. మారుబాయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ ఆసుపత్రికి తరలించకుండా ఇంట్లోనే ఉంచారు గ్రామస్తులు. వైద్యం అందించేందుకు వచ్చిన వైద్యులను కూడా అడ్డుకున్నారు గిరిజనులు. మారుబాయి ప్రాణాలు దేవుడే కాపాడతాడంటూ వైద్యులను అడ్డుకున్నారు గిరిజనులు.
►ALSO READ | కరీంనగర్ జిల్లాలో విషాదం.. అనారోగ్యంతో భర్త మృతి.. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని భార్య ఆత్మహత్య..
గిరిజనులను ఒప్పించేందుకు తీవ్రంగా శ్రమించారు డాక్టర్లు. ఎట్టకేలకు రెండు గంటల తర్వాత అతికష్టం మీద గిరిజనులను ఒప్పించి మారుబాయిని ఆసుపత్రికి తరలించారు డాక్టర్లు. అయితే.. మారుబాయిని ఆసుపత్రికి తరలించేందుకు రోడ్డు మార్గం వాడొద్దంటూ ఆంక్షలు విధించారు కొలాం పెద్దలు.
దీంతో చేసేదేమీలేక పంట పొలాల మధ్య నుంచి మారుబాయిని ఆసుపత్రికి తరలించారు డాక్టర్లు. ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆసుపత్రిలో మారుబాయికి చికిత్స అందిస్తున్నారు. మారుబాయి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు సమాచారం.
