Harom Hara OTT: హరోం హర ఓటీటీ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్..వాయిదాకి ప్రణీత్ హనుమంతు కారణమా?

Harom Hara OTT: హరోం హర ఓటీటీ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్..వాయిదాకి ప్రణీత్ హనుమంతు కారణమా?

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు(Sudheer Babu) హీరోగా ‘సెహరి’ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో రిలీజై ఆకట్టుకున్న పాన్ ఇండియా మూవీ ‘హరోం హర’(Harom Hara).ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఈటీవీ విన్, ఆహా ఓటీటీలు అధికారికంగా కూడా ప్రకటించాయి.అయితే,జూలై 11న ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రాలేదు.

ఇప్పుడు,తాజాగా కొత్త స్ట్రీమింగ్ డేట్‍ను ఈటీవీ విన్ వెల్లడించింది.ఈ మేరకు జూలై 18 న ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కాబోతుందంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.అయితే,ఆహా స్ట్రీమింగ్ డేట్ కి సంబంధించిన వివరాలు మాత్రం ప్రకటించలేదు.ఇక త్వరలోనే ఆహా నుంచి అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.మరి ఆహా కూడా జూలై 18న స్ట్రీమింగ్ కు తీసుకొస్తుందా లేదా మరో కొత్త తేదీలో వస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

Also Read :- ఇండియన్ 2 ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్.. విక్రమ్ కంటే తక్కువే

ఈ మూవీని తెలుగు ప్రాంతాల వరకే కాకుండా..పాన్ ఇండియా లెవెల్లో నిర్మించారు.సుధీర్ బాబు కెరీర్లోనే భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా..శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ నిర్మించింది.

వాయిదా అవ్వడానికి కారణం: 

హరోం హర సినిమా ఓటీటీ రిలీజ్ పై అధికారికంగా ప్రకటన వచ్చాక కూడా వాయిదా పడుతుండటం ఆడియన్స్ లో సందేహాలు మొదలయ్యాయి. వాయిదా పడటానికి కారణం లేకపోలేదు.ఇటీవలే యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు డార్క్ కామెడీతో చేసిన వీడియో వ్యవహారమే అందుకు కారణంగా తెలుస్తోంది.ఓ తండ్రీకూతుళ్ల వీడియోపై ప్రణీత్ తన యూట్యూబ్ ఛానెల్‍లో స్నేహితులతో కలిసి అసభ్య కామెంట్లు చేయగా..ఆ వీడియోపై సాయి ధరమ్ తేజ్ ఘాటుగా స్పందించాక ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రియాక్ట్ అయ్యారు.దీంతో ఈ వ్యవహారం ఇండియా వైడ్ గా వైరల్ అవుతూ వచ్చింది.ఇక ఆ యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును తక్షణమే పోలీసులు అరెస్ట్ చేశారు.ఇంతకీ హరోం హర సినిమాకి ప్రణీత్ హనుమంత్ కి సంబంధం ఏంటని అనుకుంటున్నారా?

Also Read :- బాక్సాఫీస్‌పై కల్కి దండయాత్ర

హరోం హర మూవీలో ప్రణీత్ హనుమంతు ఓ పాత్రలో నటించాడు.అయితే,రీసెంట్ గాహీరో సుధీర్ బాబు రియాక్ట్ అవుతూ..ఈ సినిమాలో ప్రణీత్ హనుమత్ కు యాక్టింగ్ ఛాన్స్ ఇచ్చినందుకు అసహ్యంగా ఉందంటూ'పోస్ట్ చేశాడు.దీంతో హరోం హర సినిమాలో ప్రణీత్ ఉన్న సీన్లను కట్ చేసి ఓటీటీలోకి తీసుకురావాలని మూవీ యూనిట్ డిసైడ్ అయింది.అందుకే స్ట్రీమింగ్ డేట్ వాయిదా పడింది.

కథ:

ఆంధ్రప్రదేశ్,కర్ణాటక,తమిళనాడు మూడు సరిహద్దులు కలిసే ప్రాంతం కుప్పం.ఆ ఊరును తిమ్మారెడ్డి అతని సోదరులు తమ గుప్పెట్లో పెట్టుకుంటారు. అదే సమయంలో కుప్పం పాలిటెక్నిక్ కాలేజీలో ఆ ఊరికి వస్తాడు సుబ్రహ్మణ్యం(సుధీర్ బాబు).అనుకోకుండా ఒకవ్యక్తితో గొడవ జరిగి కాలేజీ నుంచి సస్పెండ్ అవుతాడు.ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడటానికి తన స్నేహితుడైన పళని స్వామి(సునీల్)తో కలిసి గన్ తయారీ మొదలు పెడతాడు.అలా గన్ తయారీ మొదలుపెట్టిన సుబ్రహ్మణ్యం..జీవితం తరువాత ఎలాంటి మలుపులు తిరిగింది?ఉద్యోగం పోవడానికి కారణమైన వ్యక్తితో సుబ్రహ్మణ్యం ఎందుకు చేతులు కలిపాడు? సుబ్రహ్మణ్యం ఆ ఊరికి  దేవుడు ఎలా అయ్యాడు? అనేది మిగిలిన కథ?