Kalki 2898 AD Box Office: బాక్సాఫీస్‌పై కల్కి దండయాత్ర..రూ.1000కోట్ల క్లబ్‌లో ప్రభాస్..ఇంకా 5 కోట్లు వస్తే!

Kalki 2898 AD Box Office: బాక్సాఫీస్‌పై కల్కి దండయాత్ర..రూ.1000కోట్ల క్లబ్‌లో ప్రభాస్..ఇంకా 5 కోట్లు వస్తే!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD.దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు.భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. 

తాజాగా కల్కి మూవీ పదిహేను రోజులకు గాను రూ.1000 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టినట్లు కల్కి ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది."ఈ అద్భుతమైన మైలురాయిని సాధించుటకు కారణమైన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు "అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది.అంతేకాకుండా ప్రభాస్ హీరోగా వెయ్యి కోట్లు సాధించిన రెండో సినిమాగా కల్కి నిలిచింది.ఇక 1000 కోట్లు కలెక్షన్లు రాబట్టిన వాటిలో ఏడవ మూవీగా రికార్డ్ నెలకొల్పింది.

ALSO READ | Indian 2 Day 1 Collections: ఇండియన్ 2 ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్..రికార్డులు అనుకుంటే చతికిలపడిందే..విక్రమ్ కంటే తక్కువే

ఇదిలా ఉంటే,కల్కి 2898 ఏడీ నిర్మాతలకు ఇప్పటికీ రూ.95.09 కోట్ల లాభం వచ్చిందని ప్రముఖ ట్రేడ్ సంస్థలు చెబుతున్నాయి.అంటే వంద కోట్ల లాభానికి ఇంకా 5 కోట్లు కావాల్సి ఉంది.ప్రస్తుతం ఈ సినిమాకి పోటీగా ఇండియన్ 2,అక్షయ్ కుమార్ సినిమా ఉంది.ఇక ఈ రెండు సినిమాలకి మిశ్రమ స్పందన వస్తుండటంతో వసూళ్లు కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.  

ALSO READ | Bharatiyadu 2 movie Review : భారతీయుడు 2 స్టోరీ ఇదే.. బొమ్మ హిట్టా? ఫట్టా?

గతంలో ప్రవరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్లు కలెక్షన్లు రాబట్టిన చిత్రాలు చూసుకుంటే..బాలీవుడ్ స్టార్ హీరోగా అమిర్ ఖాన్ నటించిన స్పోర్ట్స్ డ్రామా మూవీ దంగల్.ఈ మూవీ రూ.2024 కోట్లు సాధించగా..ప్రభాస్ బాహుబలి-2 రూ.1810.60 కోట్లు,ఎన్టీఆర్,చరణ్ RRR రూ.1387.26కోట్లు,యష్,ప్రశాంత్ నీల్ KGF రూ.1250 కోట్లు,షారుక్ ఖాన్ పఠాన్ మూవీ రూ.1050కోట్లు,కాగా జవాన్ రూ.1148.32కోట్ల కలెక్షన్లు సాధించాయి.