
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో సూర్య హీరోగా నటిస్తున్న 45వ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. నేడు (జూన్ 20న) సూర్య 45వ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేస్తూ, పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీకి “కరుప్పు”అనే పవర్ఫుల్ టైటిల్ ఖరారు చేశారు. 'కరుప్పు' అంటే తమిళంలో నలుపు అని అర్థం. కానీ, ఈ సినిమా టైటిల్ పోస్టర్ పూర్తిగా రెడ్ కలర్ లుక్‌లో ఉండటం ఆసక్తి కలిగిస్తోంది.
With pride and Excitement, we present the title of #Suriya45: 'KARUPPU'. A name that embodies the soul of our story, shaped by heart, spirit, and purpose. #கருப்பு #Karuppu💥
— DreamWarriorPictures (@DreamWarriorpic) June 20, 2025
Wishing a very Happy Birthday to our director @RJ_Balaji 💐@Suriya_offl @trishtrashers #Indrans… pic.twitter.com/xW3DD94Wfs
ఇందులో సూర్య వెనక్కి తిరిగి, చేతిలో కత్తి పట్టుకుని కనిపిస్తున్నాడు. ఇది పక్కా మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతుందని స్పష్టమవుతోంది. అలాగే, పోస్టర్లో ఓ భారీ విగ్రహం, త్రిశూలాలు, ఆయుధాలతో కూడిన గర్భగుడి.. వంటివి సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి.
నయనతారతో ‘అమ్మోరు తల్లి’చిత్రం తెరకెక్కించిన నటుడు ఆర్జే బాలాజీ (RJ Balaji)..ఈ యాక్షన్ అడ్వెంచరస్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పూర్తిచేసుకుని, వరుస షూటింగ్ షెడ్యూల్స్ తో బిజీగా ఉంది. సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నారు. జీకే విష్ణు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ మూవీ, 2025 ప్రారంభంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
ఇకపోతే డైరెక్టర్ ఆర్జే బాలాజీ రేడియో జాకీగా కెరీర్‌ను ప్రారంభించారు. ఆయన మల్టీ టాలెంటెడ్. యాక్టర్‌గా, సింగర్‌గా, కమెడియన్, డైరెక్టర్‌గా రాణిస్తున్నారు. సూర్య తన 45వ సినిమా పూర్తియిన తర్వాత స్టార్ డైరెక్టర్ వెట్రీ మారన్ తో 46వ చిత్రం ఉంటుంది.
సూర్య-త్రిష కాంబినేషన్:
ఈ సినిమాలో సూర్యకి జోడిగా స్టార్ హీరోయిన్ త్రిష (Trisha) నటిస్తుంది. అయితే.. సూర్య, త్రిష ఇద్దరు కలిసి 2005లో చేసిన ఆరు సినిమా తర్వాత మళ్లీ స్క్రీన్‌పై కనిపించలేదు. అంటే 19 ఏళ్ల తర్వాత ఈ జంట స్క్రీన్ పై మెరువబోతుందన్నమాట.
Congratulations on 22 glorious years @trishtrashers ⭐️ And we are elated to start the 23rd year with #Suriya45 🔥 pic.twitter.com/fDkbbDqAbS
— RJ Balaji (@RJ_Balaji) December 13, 2024
తమ కెరీర్ లో మౌనం పేసియాదే, ఆయుత ఏడు, ఆరు సినిమాల తర్వాత తెరపై మళ్ళీ కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ కి పండుగనే చెప్పుకోవాలి. ప్రస్తుతం త్రిష వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
We proudly announce #Suriya45 – a groundbreaking collaboration featuring the versatile @Suriya_offl🔥, the musical legend @arrahman❤️, and the talented @RJ_Balaji. A powerful journey begins!💥@prabhu_sr ✨ pic.twitter.com/7O37KDIOqy
— DreamWarriorPictures (@DreamWarriorpic) October 14, 2024