Taapsee Pannu : పెళ్లి పీటలు ఎక్కనున్న..టాలీవుడ్‌ సుందరి, బ్యాడ్మింటన్ ప్లేయర్

Taapsee Pannu : పెళ్లి పీటలు ఎక్కనున్న..టాలీవుడ్‌ సుందరి, బ్యాడ్మింటన్ ప్లేయర్

టాలీవుడ్‌లో సోట్ట బుగ్గల సుందరి అనగానే టక్కున గుర్తొచ్చే పేరు తాప్సీ (Taapsee)..ఝమ్మంది నాధం సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన తాప్సీ అందరికి సుపరిచితమే. తెలుగులో కోన్ని సినిమాల్లో హీరోయిన్‌గా చేసినప్పటికీ..ఆమెకు పెద్దగా సెక్సెస్ రాకపోవడంతో..పోకస్ మోత్తం బాలీవుడ్ షిప్ట్ చేసింది. ప్రస్తుతం అక్కడ వరుస సినిమాలు చేస్తూ బీజిగా గడిపేస్తుంది.

తాజా సమచారం ప్రకారం త్వరలోనే  తాప్సీ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథియాస్(Mathias)తో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. వీరిద్దరు పదేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు ఇప్పటికే సోషల్ మీడియాలో గుసగుసలు వినిపించినప్పటికి వాళ్ళు ఎక్కడ బయటపడలేదు. ఇటీవల తాప్సీ తమ లవ్ గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. డెస్టినేషన్ వెడ్డీంగ్ చేసుకోవాలని ఈ జంట ఫిక్స్ అయ్యారంట.అందుకు ఉదయపూర్ వేదిక కానుంది. ఈ వివాహ వేడుకకి కుటుంబ సభ్యులు, బందుమిత్రులు మాత్రమే హజరవుతారని తెలుస్తోంది. అంతేకాదు..ఈవెంట్‌కి సినీ సెలబ్రేటిస్ ఎవరు అటెండ్ కాట్లేదని సమాచారం. వీరి వివాహం త్వరలోనే సిక్క, క్రైస్తవ పద్దతుల్లో..మార్చి నెలాఖరులో జరగనుంది. 

రీసెంట్గా తాప్సీ నటించిన డంకీ గత డిసెంబర్‌లో రిలీజ్ అయింది. బాలీవుడ్ బాద్‍షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు. ఇక తాప్సీ తన నెక్స్ట్ సినిమాని మొదలు పెట్టేసింది. ‘వా లడీ హై కహా’ చిత్రంలో విభిన్నమైన రోల్లో తాప్సీ కనిపించనుంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ కాగా..పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అలాగే మరో రెండు చిత్రాలు కూడా తాప్సీ చేతిలో ఉన్నాయి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mathias Boe (@mathias.boe)